దేశంలో ఎక్కడ ఎన్నికలు జరిగిన బీజేపీదే విజయం

దేశంలో ఎక్కడ ఎన్నికలు జరిగిన బీజేపీదే విజయం

ఈశాన్య రాష్ట్రాల్లో జరిగిన ఎన్నికల్లో బీజేపీ విజయకేతనం ఎగిరేసిన నేపథ్యంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ స్పందించారు. ముందుగా కర్యకర్తలతో కలిసి మిఠాయిలు పంచుకొని సాగర్ రహదారిపై బాణసంచులు కాల్చి సంబరాలు చేసుకున్నారు. అనంతరం మీడియాతో మాట్లాడిన ఆయన..ఈశాన్య రాష్ట్రాల్లో కషాయం జండను పట్టుకొని తిరగలేని స్థాయి నుండి భారతీయ జనతా పార్టీ జెండాను ఎగరేసే స్థాయిలో ప్రధాన మంత్రి మోడీ హవా కొనసాగుతుందని అన్నారు. ప్రజలు బీఆర్ఎస్ పార్టీని నమ్మే స్థితిలో లేరని, దేశంలో ఎక్కుడ ఎన్నికలు జరిగిన బీజేపీ విజయ కేతనం ఎగరేసిందని తెలిపారు. తెలంగాణ రాష్ట్రంలో రాబోయే ప్రభుత్వం బీజేపీదే అని వెల్లడించారు. రాష్ట్ర ఎన్నికలపై దేశం మొత్తం తెలంగాణ వైపుకు చూస్తుందని పేర్కొన్నారు.