
ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే టీఎస్ పీఎస్సీ(TSPSC) పేపర్ లీక్ జరిగిందని బండి సంజయ్ ఆరోపించారు. కేసీఆర్ కుటుంబ ధనాపేక్ష వల్ల లక్షలాది మంది అభ్యర్థుల జీవితాలు ఆగమయ్యాయని విమర్శించారు. పేపర్ లీక్ కేసును సిట్టింగ్ జడ్జితో విచారించడంతో పాటు కేటీఆర్ ను బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు. సికింద్రాబాద్ కార్ఖాన పోలీస్ స్టేషన్ నుండి విడుదలైన బండి సంజయ్.. విద్యార్థుల జీవితాల గురించి ఆలోచించకుండా.. లిక్కర్ స్కామ్ లో కవితను కాపాడుకోవడానికి క్యాబినెట్ మొత్తం ఢిల్లీకి వెళ్లిందని విమర్శించారు.
కేటీఆర్ ను భర్తరఫ్ చేసి విద్యార్థులకు న్యాయం చేసే వరకు వదిలిపెట్టే ప్రసక్తే లేదని బండి సంజయ్ అన్నారు. పేపర్ లీక్ లో పార్టీ కార్యకర్తలను కాపాడుకోవడానికి లక్షల మంది విద్యార్థుల జీవితాలను బలిచేశారని ఆరోపించారు. పేపర్ లీక్ పై ఆందోళన చేసిన విద్యార్థులను, కార్యకర్తలను అరెస్ట్ చేస్తున్నారని.. ఇక నుంచి కేసీఆర్ కు చుక్కలు చూపెడ్తామని హెచ్చరించారు బండి సంజయ్.
పేపర్ లీక్ ఘటనను సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలంటూ మార్చి 17న ఉదయం గన్ పార్క్ దగ్గర దీక్ష దిగిన బండి సంజయ్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. గన్ పార్కు నుంచి ర్యాలీగా టీఎస్పీఎస్సీ కార్యాలయానికి బయలుదేరిన బండి సంజయ్ ను , పాార్టీ కార్యకర్తలను పోలీసులు అరెస్ట్ చేసి కార్ఖానా పీఎస్ కు తరలించారు.