సిరిసిల్లలో పవర్ లూం క్లస్టర్ ఏర్పాటు చేయాలి: బండి సంజయ్

సిరిసిల్లలో పవర్ లూం క్లస్టర్ ఏర్పాటు చేయాలి: బండి సంజయ్

సిరిసిల్లలో పవర్ లూం క్లస్టర్ ఏర్పాటు చేయాలని కేంద్ర మంత్రి గిరిరాజ్ సింగ్ ను కోరారు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్. పవర్ లూం కస్టర్ యంత్రాల ఆధునీకరణతో పాటు ఉత్పాదకతను, కార్మికుల మధ్య ఆరోగ్యకరమైన పోటీతత్వాన్ని పెంచుతుందన్నారు. సిరిసిల్ల యార్న్ డిపో ఏర్పాటు  చేస్తే ముడి సరకులు సులభంగా, తక్కువ ధరకు లభిస్తాయన్నారు సంజయ్. 

ALSO READ | తెలంగాణలో గ్రీన్ బెంచ్?.. లేదా రాష్ట్ర స్థాయి గ్రీన్ ట్రిబ్యూనల్!

ముడిసరుకుల ధరలు పెరుగుతుండడంతో నేత కార్మికులు ఇబ్బంది పడ్తున్నారని , అందుకే సబ్సిడీ 80 శాతానికి పెంచాలని కోరారు. పావులా వడ్డీకే రుణాల ఇవ్వాలన్నారు. కేంద్ర మంత్రి గిరిరాజ్ సింగ్ తన విజ్ఞప్తికి సానుకూలంగా స్పందించారన్నారు సంజయ్. యార్న్ డిపో ఏర్పాటుతోపాటు పవర్ లూం క్లస్టర్ మంజూరుపై చర్చించి సానుకూలంగా నిర్ణయం తీసుకుంటామని హామీ ఇచ్చారని తెలిపారు.