తల్లాడ, వెలుగు: ఇసుకను అక్రమంగా తరలిస్తున్న మూడు టిప్పర్లను ఆదివారం తెల్లవారుజామున తల్లాడ పోలీసులు పట్టుకున్నారు. ఎస్సై వెంకటకృష్ణ తెలిపిన వివరాల ప్రకారం.. ఏపీ రాష్ట్రం కొవ్వూరు నుంచి తెలంగాణలోకి అక్రమంగా ఇసుకను తరలిస్తున్నట్లు సమాచారం మేరకు తల్లాడ మండలం కేశ్వాపురం వద్ద గ్రీన్ ఫీల్డ్ హైవేపై అడ్డుకొని స్టేషన్ కు తరలించినట్లు చెప్పారు. ముగ్గురు డ్రైవర్ల తోపాటు ఖమ్మం నగరానికి చెందిన ఇసుక దళారి సుమంత్ పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.
