మరో ఐదునెలల్లో రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి వస్తుందని తెలంగాణ బీజేపీ ఛీప్ బండి సంజయ్ ధీమా వ్యక్తం చేశారు. బీజేపీ ప్రభుత్వం నిలువనీడ లేని పేదలందరికీ ఇండ్లు నిర్మించి ఇస్తుందన్నారు. తెలంగాణలో ఇండ్ల కోసం ఎంతో మంది దరఖాస్తులు చేసుకున్నారని.. ఎంతమందికి కేటాయించారో చెప్పాలన్నారు. అన్ని లెక్కలను ప్రభుత్వం చెప్పడం లేదన్నారు. కేంద్ర ప్రభుత్వం రూ.2.5 లక్షల ఇండ్లు మంజూరు చేస్తే రాష్ట్రం కేవలం ఏడు వేల మందికి కేటాయించి మోసం చేసిందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం కోరితే కేంద్ర ప్రభుత్వం నుంచి పెద్ద ఎత్తున ఇండ్ల నిర్మాణానికి నిధులు తీసుకొచ్చే బాధ్యత తీసుకుంటానని చెప్పారు బండి సంజయ్.
సంగారెడ్డి జిల్లా కేంద్రంలో బీజేపీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న నిరుద్యోగ మార్చ్ ప్రారంభమయ్యింది. అమరవీరుల స్థూపానికి నివాళులు అర్పించిన బండి సంజయ్ ర్యాలీలో పాల్గొన్నారు. పోతరెడ్డిపల్లి చౌరస్తానుంచి కలెక్టరేట్ వరకు ఈ మార్చ్ సాగనుంది. కలెక్టరేట్ వద్ద ఏర్పాటు చేసిన సభలో బండి సంజయ్ మాట్లాడతారు.