నిరుద్యోగ మిలియన్ మార్చ్ నిర్వహిస్తం..బండి సంజయ్ హెచ్చరిక

నిరుద్యోగ మిలియన్ మార్చ్ నిర్వహిస్తం..బండి సంజయ్ హెచ్చరిక

సీఎం కేసీఆర్కు అంబేద్కర్ విగ్రహాన్ని ముట్టుకునే అర్హత లేదని రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ అన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని అవమానించారని మండిపడ్డారు. ఒక్కసారి కూడా కేసీఆర్ అంబేద్కర్ వర్థంతి, జయంతికి హాజరు కాలేదని గుర్తు చేశారు. కానీ ఎన్నికలు వస్తున్నాయనే హైదరాబాద్ లో అంబేద్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేశారని విమర్శించారు. 

యువత భవిష్యత్ను నాశనం చేస్తున్నడు

ముఖ్యమంత్రి కేసీఆర్ యువత భవిష్యత్ ను నాశనం చేస్తున్నారని బండి సంజయ్ విమర్శించారు.30 లక్షల మంది యువత భవిష్యత్ ను పాడుచేశారని ఆరోపించారు.  టీఎస్పీఎస్సీ పేపర్ లీక్ అయితే కనీసం ఒక్క మాట కూడా మాట్లాడలేదన్నారు. టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీపై సిట్ తో కాకుండా సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. బండారం బయటపడుతుందనే సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించడం లేదని మండిపడ్డారు. టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీపై విద్యార్థులకు కేసీఆర్ క్షమాపణ చెప్పాలని..మంత్రి కేటీఆర్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. 

ఇంట్లో అందరూ దందాలు చేస్తున్నరు

రాష్ట్రంలో అన్ని పేపర్ల తీకులకూ బండి సంజేయే కారణమని చెబుతున్నారని ఆయన మండిపడ్డారు. ప్రజల సమక్షంలో సమాధానం చెప్పక తప్పదని ఆయన పేర్కొన్నారు. ఇంట్లో కార్యక్రమం ఉందని చెప్పినా అరెస్ట్ చేశారని.... కేసిఆర్ ఇంట్లో వారంతా దందాలు చేస్తున్నారని ఆరోపించారు. టీఎస్పీఎస్సీ టిఎస్ పిఎస్ సి తప్పు లేకుంటే సిటింగ్ జడ్జితో విచారణ జరిపించాలని బండి సంజయ్ డిమాండ్ చేశారు. తప్పు లేకపోయిన ఈటలను బయటకు పంపారని గుర్తు చేశారు.  విద్యార్థులు, యువత భవిష్యత్తు కోసం బీజేపీ  పోరాడుతోందన్నారు.

ఉద్యోగాల పేరుతో మోసం..

ఈడీ విచారణ అంటే చాలు..కేసీఆర్ అనేక సాకులు చెప్తున్నారని బండి సంజయ్ ఎద్దేవా చేశారు.  30 లక్షల మంది యువత ఇబ్బందిపడితే ప్రగతి భవన్ నుంచి బయటకు రారని ఆగ్రహం వ్యక్తం చేశారు.  రైతులు, ఇంటర్ విద్యార్థులు, ఆర్టీసీ కార్మికులు ఆత్మహత్య చేసుకున్నా...కేసిఆర్ స్పందించరని మండిపడ్డారు. ప్రభుత్వ ఉద్యోగం కోసం ఎన్నో బాధలుపడి హైదరాబాద్ వస్తారని..కానీ కేసీఆర్  ఉద్యోగాల పేరుతో  యువతను మోసం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. యూనివర్సీటీల్లో కనీస సౌకర్యాలు లేక విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నా పట్టించుకోవడం లేదన్నారు. 
యువత చదువుకుంటే ప్రశ్నిస్తారని..ఉద్యోగాలు అడుగుతారని అందుకే వర్సిటీలను నిర్వీర్యం చేశారన్నారు. 

బీజేపీ ప్రభుత్వం వస్తే..

తెలంగాణలో బీజేపీ ప్రభుత్వం రావడం ఖాయమని బండి సంజయ్ దీమా వ్యక్తం చేశారు. బీజేపీ ప్రభుత్వం ఏర్పడిన మరుక్షణమే రాష్ట్రంలో ఖాళీలను భర్తీ చేస్తామన్నారు. ప్రతీ ఏడాది జాబ్ కాలెండర్ ను రిలీజ్ చేస్తామన్నారు. ఫీజు రీయింబర్స్ మెంట్ బకాయిలను విడుద చేస్తామన్నారు. లిక్కర్ స్కాంలో బిడ్డ దొరికితే ఆమెపై చర్యలు తీసుకోరని..పేపర్ లీకేజీలో కేటీఆర్ హస్తం ఉన్నా ఏమీ అనరన్నారు. కానీ దళిత మంత్రి రాజయ్యను మాత్రం ఏ తప్పు చేయకున్నా...మంత్రి  పదవి నుంచి తీసివేస్తారని ఆగ్రహం వ్యక్తం చేశారు.