
రైతు చట్టాలపై ప్రజలకు వాస్తవాలు వివరిస్తామన్నారు రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్. రైతుల కోసం తీసుకొచ్చిన మొట్టమొదటి చట్టం ఇదే అన్నారు. ప్రధాని మోడీకి తెలంగాణ రైతుల తరపున కృతజ్ఞతలు తెలిపారు సంజయ్. రైతు సంక్షేమం, అభివృద్ధి కోసమే రైతు చట్టాలను కేంద్రం తీసుకొచ్చిందన్నారు. ఆగస్టు 15 న కాదు. సెప్టెంబర్ 26న రైతులకు నిజమైన స్వాతంత్ర్యం వచ్చిందన్నారు బండి సంజయ్. సీఎం కేసీఆర్ ఈ చట్టాన్ని ఎందుకు వ్యతిరేకిస్తున్నారో చెప్పాలన్నారు. ప్రజల్ని ఎలా దోచుకోవాలి, ప్రతి అంశాన్ని ఎలా రాజకీయం చేయాలనే కేసీఆర్ ఆలోచిస్తారన్నారు. కేసీఆర్ కళ్ళుండి నిజాలు చూడలేని కాబోది అని అన్నారు.కుళ్లు, కుతంత్రాలతో నిండి పోయిన తన మనసును కేసీఆర్ ప్రక్షాళన చేసుకోవాలన్నారు. రైతు పండించిన పంటకు తానే ధరను నిర్ణయించుకోవడం తప్పా? అని ప్రశ్నించారు. ఇరిగేషన్ అంశాలపై కేంద్రానికి లేఖ రాసిన సీఎం, ఈ ఆరు సంవత్సరాలు ఎక్కడ ఉన్నాడని.. సోయి లేకుండా ఫామ్ హౌస్ లో పడుకున్నాడన్నారు. అపెక్స్ కౌన్సిల్ లో మాట్లాడకుండా… లేఖ రాయడం వెనుక ఉద్దేశ్యం ఏమిటన్నారు బండి సంజయ్.
థియేటర్లు ఓపెన్ చేస్తాం…సర్కార్ రాయితీలివ్వాలి
వికారాబాద్ లో మహిళను హత్యచేసి పూడ్చి పెట్టిన దుండగులు
24 గంటల్లో 79,476 కేసులు..1069 మరణాలు