కొందరు ఫాల్తుగాళ్లు తప్పుడు ప్రచారం చేస్తున్నరు : బండి సంజయ్

కొందరు ఫాల్తుగాళ్లు తప్పుడు ప్రచారం చేస్తున్నరు : బండి సంజయ్
  • అది కొందరు ఫాల్తుగాళ్లు చేస్తున్న ప్రచారం 
  • గెలుస్తున్నది, గెలవబోయేది బీజేపీయే
  • బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్

కరీంనగర్: వేములవాడ ఆలయంలోకి కేంద్ర మాజీ మంత్రి

చెప్పులతో వెళ్లినట్టు కొందరు తప్పుడు ప్రచారం చేస్తున్నారని బీజేపీ స్టేట్ చీఫ్ బండి సంజయ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. కరీంనగర్ టవర్ సర్కిల్ లో జరగుతున్న స్మార్ట్ సిటీ పనులను ఇవాళ బండి సంజయ్ కుమార్ పరిశీలించారు. ఈ సందర్భంగా పనుల్లో జాప్యం, నాణ్యతాలోపంపై కార్పొరేషన్ కమిషనర్ పై, కాంట్రాక్టర్ పై ఆగ్రహం వ్యక్తం చేశారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ ప్రకాష్ జవదేకర్ చెప్పులతో గుడిలోకి వెళ్లినట్టు చేస్తున్‌న ప్రచారాన్ని ఖండించారు. బీజేపీ స్తంబ్ధంగా ఉందంటూ జరుగుతున్న ప్రచారంలో కరెక్ట్ కాదన్నారు. రాష్ట్రంలో గెలుస్తున్నది, గెలవబోయేది బీజేపీ మాత్రమేనన్నారు. మునుగోడు ఓటమి నుంచి గెలుపు దిశగా తమ ప్రయాణం మొదలైందని చెప్పారు.