ప్రభుత్వం ఉద్యమకారులను అణిచివేస్తోంది

ప్రభుత్వం ఉద్యమకారులను అణిచివేస్తోంది

తెలంగాణ రాష్ట్రంలో నిరంకుశ పాలన కొనసాగుతోందన్నారు BJP రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ . అరాచకాలను ప్రశ్నించే గొంతుకలను అణిచి వేస్తోందన్నారు. హైదరాబాద్ లో పార్టీ ప్రధాన కార్యదర్శుల సమావేశం నిర్వహించారు బండి. ఈ సమావేశానికి రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి తరుణ్ చుగ్ హాజరయ్యారు. ప్రస్తుత పరిణామాలపై ఈ సమావేశం లో చర్చ జరిగింది.

ఇందులో భాగంగా మాట్లాడిన బండి సంజయ్.. మృగశిర ప్రారంభమైనా ధాన్యం కొనరా అంటూ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. కేసీఆర్ నిరంకుశ పాలనను వ్యతికించిన ప్రతి ఒక్కరినీ టార్గెట్ చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ముఖ్యంగా తెలంగాణ ఉద్యమ కారులను అణిచివేయడమే లక్ష్యంగా పాలన సాగుతోందన్నారు. వాళ్ళ కేబినెట్ లో కీలక మంత్రిగా పని చేసిన ఈటల రాజేందర్ కే భద్రత లేని పరిస్థితులు సృష్టించారని విమర్శించారు. వాళ్ల కు డబ్బా కొడితే మంచోళ్ళు.. లేకుంటే అవినీతిపరులన్న ముద్ర వేస్తున్నారని అన్నారు. 

జర్నలిస్టు రఘును పట్ట పగలు దొంగల్లాగా పోలీసులే కిడ్నాప్ చేశారని విమర్శించారు బండి సంజయ్.TRS నాయకుల కబ్జాలను వెలికితీస్తే కిడ్నాప్ చేస్తారా అని ప్రశ్నించారు. రాష్ట్రంలో ఒక మంత్రికి స్థాయి వ్యక్తికి, జర్నలిస్టులకు, సామాన్యులకు రక్షణ లేకుండా పోయిందన్నారు.

కేంద్రం ఉచితంగా ప్రకటించిన వ్యాక్సినేషన్ ను సమర్థవంతంగా నిర్వర్తించే ఏర్పాట్లు రాష్ట్రం దగ్గర లేవన్నారు. వెంటనే అవసరమైనంత సిబ్బందిని నియమించే కోవాలని సూచించారు. ప్రధాని ప్రకటించిన ఫ్రీ వ్యాక్సిన్ సకాలం లో ప్రజలకు అందే విధంగా రాష్ట్ర ప్రభుత్వం సన్నద్ధం కావాలన్నారు.

ఇప్పుడు తెలంగాణ వాదులు, ప్రజా స్వామ్యవాదులకు ఏకైక వేదిక బీజేపీ మాత్రమేనని.. పలువురు కీలక నాయకులు పార్టీలో చేరేందుకు ఆసక్తి చూపుతున్నారన్నారు బండి సంజయ్.