NBPGRలో ఉద్యోగ ఇంటర్వ్యూలు.. డిగ్రీ పాసై అనుభవం ఉన్నోళ్లకు ఛాన్స్..

 NBPGRలో ఉద్యోగ ఇంటర్వ్యూలు.. డిగ్రీ పాసై అనుభవం ఉన్నోళ్లకు ఛాన్స్..

ఐసీఏఆర్ నేషనల్ బ్యూరో ఆఫ్ ప్లాంట్ జెనెటిక్ రిసోర్సెస్ (ఐసీఏఆర్ ఎన్​బీపీజీఆర్) యంగ్ ప్రొఫెషనల్ I పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆసక్తి, అర్హత గల అభ్యర్థులు అప్లై చేవయచ్చు.

ఖాళీలు: 02 (యంగ్ ప్రొఫెషనల్ I)

ఎలిజిబిలిటీ:  గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుంచి కనీసం 60 శాతం మార్కులతో సైన్స్​లో పట్టభద్రులై ఉండాలి. ఫీల్డ్ డేటా విశ్లేషణలో రెండు లేదా అంతకంటే ఎక్కువ సంవత్సరాల అనుభవం ఉండాలి. కంప్యూటర్ ప్రాథమిక జ్ఞానం ఎంఎస్ ఆఫీస్, ఎక్సెల్, పీపీటీ, గణాంక విశ్లేషణలో అనుభవం ఉండాలి. 

వయోపరిమితి: 21 నుంచి 45 ఏండ్ల మధ్యలో ఉండాలి. 

అప్లికేషన్: ఆన్​లైన్ ద్వారా.

వాక్ ఇన్ ఇంటర్వ్యూ: జనవరి 28. 

సెలెక్షన్ ప్రాసెస్: షార్ట్​లిస్ట్, పర్సనల్ ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. 

పూర్తి వివరాలకు  nbpgr.org.in  వెబ్​సైట్​ను సందర్శించండి.