క్రేజీ స్టార్ నవీన్ పొలిశెట్టి, సెన్సేషన్ బ్యూటీ మీనాక్షి చౌదరి జంటగా నటించిన లేటెస్ట్ మూవీ ‘అనగనగా ఒక రాజు’. కోలీవుడ్ దర్శకుడు మారి తెరకెక్కించిన ఈ చిత్రాన్ని సూర్యదేవర నాగ వంశీ, సాయి సౌజన్య నిర్మించారు. రొమాంటిక్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా రూపొందిన ఈ సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 14న ప్రేక్షకుల ముందుకు రానుంది.
ఈ సందర్భంగా విడుదల చేసిన ట్రైలర్ సినిమాపై అంచనాలను మరింత పెంచింది. హీరో నాగార్జున బ్యాక్‌గ్రౌండ్ వాయిస్‌తో ట్రైలర్ ప్రారంభమవడం స్పెషల్ హైలైట్‌గా నిలిచింది. ట్రైలర్‌లో నవీన్ పొలిశెట్టి లుక్, క్యారెక్టర్ కంప్లీట్ ఎంటర్‌టైనింగ్‌గా కనిపించాయి. అతని కామెడీ టైమింగ్ మరోసారి ప్రధాన ఆకర్షణగా నిలవగా, మీనాక్షి చౌదరితో కెమిస్ట్రీ ప్రేక్షకులను ఆకట్టుకుంది.
నాకు కాబోయే మామగారికి ఇద్దరు ముగ్గురు పిల్లలుంటే.. ఎఫెక్షన్ మొత్తం డివైడ్ అయిపోద్ది.. డివైడ్ అంటే ఏంటని అడగ్గా.. తెలుగులో ఆస్తులు అంటారా.. అని నవీన్ చెప్పిన విధానం బాగుంది. హీరోయిన్ ఎంట్రీ ఇవ్వడంతోనే.. పంతులు ఉండి.. ‘మంత్రాన్ని తిరిగి చెప్పమ్మా.. అంటే, హీరోయిన్ చుట్టూ తిరుగుతూ చెబుతుండటం ఆసక్తి రేపుతోంది. పాపా చాలా తెలివైందని నవీన్ చెప్పగా చదివింది ఇంటరే..’ అని కమెడియన్ చమ్మక్ చంద్ర అందుకున్న విధానం హైలెట్ అయింది.
ALSO READ : ‘కేజీఎఫ్’ తర్వాత యష్ ఇంకా డేంజరస్
ఇక హీరో-హీరోయిన్ మాట్లాడుకుంటూ..‘‘నీకు చిన్నప్పుడు అమెరికా వెళ్లే ప్లాన్స్ ఏమైనా ఉన్నాయా అని మీనాక్షిఅడగ్గా.. అయ్యో బాబోయ్ చిన్నప్పుడు పెరిగింది అంతా అక్కడే.. ఏరా వైట్ హౌస్ అలానే ఉందా అనగానే, కొంచెం బ్లాక్ అయిందని మహేష్ చెప్పడంతో నవ్వులు పూయిస్తుంది. అలాగే, నీతో ప్రేమలో చాలా దూరంగా వెళ్ళిపోయాను చారు.. ఇప్పుడు దూరంగా వెళ్ళిపోమంటే ఎలా? నా ప్రేమ కూకట్ పల్లి ఫ్లై ఓవర్ లాంటిది.. అక్కడ యూటర్న్ లేదు.. అయినా, మీ అమ్మాయిలకు ఏం ఫీలింగ్స్ ఉంటాయి చారు.. ఏమైనా మందు తాగి గడ్డం పెంచుకుంటారా? చెప్పు అనగానే.. మీనాక్షి ' మాకు గడ్డం ఎందుకు పెరుగుతుంది.. అని అనగానే, అదే కదా మీకు ఫీలింగ్స్ ఉంటే పెరుగుతుంది’’ అని చెప్పడంతో ట్రైలర్ ఆసక్తి పంచుతుంది.
ఇప్పటికే రిలీజైన పాటలు, టీజర్ సినిమాపై మంచి బజ్ క్రియేట్ చేయగా, తాజా ట్రైలర్‌తో ఆ ఆసక్తి మరింత పెరిగింది. సంక్రాంతి బరిలో ‘అనగనగా ఒక రాజు’ ఎలాంటి రిజల్ట్ అందుకుంటుందో చూడాలి.
ALSO READ : “అప్పుడు తమ్ముళ్లతో చేశా.. ఇప్పుడు అన్నయ్యతో వస్తున్నా!”
ఇకపోతే.. 2026 సంక్రాంతి బరిలో ప్రభాస్ నటించిన రాజా సాబ్తో పాటుగా చిరు-అనిల్ మూవీ, రవితేజ-కిషోర్ తిరుమల మూవీస్ ఉన్నాయి. గతంలో చూసుకుంటే.. సంక్రాంతికి స్టార్ హీరోల సినిమాలకు పోటీగా చిన్న హీరోలు వచ్చిన సందర్భాలు చాలానే ఉన్నాయి. వాటిలో ఏ ఒక్కటి నిరాశ పరచలేదు. దానికితోడు భారీ విజయాలు కూడా నమోదు చేసుకున్నాయి. ఇక ఈసారి కామెడీ స్టార్ నవీన్ సక్సెస్ అందుకోవడం పక్కా అనే చెప్పాలి.
