కన్నడ స్టార్ యష్ ‘KGF: Chapter 2’ తర్వాత భారీ విరామం తీసుకుని మళ్లీ వెండితెరపైకి వస్తున్న చిత్రం ‘టాక్సిక్: ఎ ఫెయిరీ టేల్ ఫర్ గ్రోన్-అప్స్’. ఈ సినిమా 2026 మార్చి 19న విడుదలకు సిద్ధమవుతోంది. ఇవాళ (2025 జనవరి 8న) యష్ 40వ పుట్టినరోజు సందర్భంగా పవర్ ఫుల్ టీజర్ విడుదల చేశారు మేకర్స్. రిలీజైన క్షణాల్లోనే టీజర్ సోషల్ మీడియాలో సంచలనం సృష్టిస్తోంది. ఇందులో యష్ ‘రాయా’ అనే క్రూరమైన గ్యాంగ్‌స్టర్ పాత్రలో కనిపించనున్నాడు.
2 నిమిషాల 31 సెకన్ల నిడివి గల ఈ టీజర్ ఓ సమాధి స్థలంలో స్టార్ట్ అయింది. చర్చ్ ఫాదర్ అంత్యక్రియల ప్రార్థనలు చేస్తుండగా, అక్కడికి గ్యాంగ్ దూసుకువస్తుంది. చుట్టూ ఉన్నవారిని భయపెడుతూ, ఆ స్థలాన్ని పూర్తిగా తమ కంట్రోల్‌లోకి తీసుకుంటారు. తమ గ్యాంగ్‌కి చెందిన వ్యక్తి కొడుకును అక్కడే పూడ్చేందుకు ఏర్పాట్లు చేస్తారు. ఈ సమయంలో “అతను వస్తాడా?” అని ఒకరు అడగగా, “అంత పిచ్చోడు ఎవరూ ఉండడు” అన్న సమాధానం వస్తుంది. అదే సమయంలో హీరో ఎంట్రీకి పర్ఫెక్ట్ బిల్డప్ ఏర్పడుతుంది.
ALSO READ : “అప్పుడు తమ్ముళ్లతో చేశా..
అంతలో ఓ కారు వేగంగా వచ్చి సమాధి స్థలం గేట్ ముందు చెట్టును ఢీకొంటుంది. మత్తులో ఉన్న ఓ వ్యక్తి విచిత్రంగా బాంబ్ సెట్ చేయడం గ్యాంగ్‌ని గందరగోళానికి గురి చేస్తుంది. ఆ వెంటనే యష్ ఇచ్చిన ఎంట్రీ అదిరిపోయింది. ఒక్కసారిగా సమాధి స్థలం మొత్తం పేలుళ్లతో దద్దరిల్లిపోతుంది. బ్లాక్ కాస్ట్యూమ్‌లో, చేతిలో థాంప్సన్ మెషిన్ గన్, నోట్లో సిగార్‌తో యష్ ‘రాయా’గా స్క్రీన్‌ను షేక్ చేస్తున్నాడు. శత్రువులను కాల్చడం, నరుకడం వంటి సీన్లు అతన్ని పూర్తిగా లార్జర్ దెన్ లైఫ్ క్యారెక్టర్‌గా చూపిస్తున్నాయి. చివరగా “డాడీస్ హోమ్” అనే డైలాగ్‌తో టీజర్ ముగియగా, యష్ అభిమానుల్లో హైప్ పీక్‌కి చేరింది.
టాక్సిక్ విడుదల తేదీ దగ్గరపడుతుండటంతో మూవీ టీమ్ ప్రమోషన్ల స్పీడ్ పెంచింది. ఇప్పటికే కియారా అద్వానీ, నయనతార, హ్యూమా ఖురేషీ లుక్స్ రివీల్ చేసి సోషల్ మీడియాలో భారీ బజ్ క్రియేట్ చేశారు. ముఖ్యంగా లేడీ సూపర్ స్టార్ నయనతార ‘గంగ’ లుక్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. అలాగే, క్రేజీ బ్యూటీ రుక్మిణి వసంత్ సైతం కీలక పాత్రలో నటిస్తుంది. ‘మెల్లిసా’ అనే పాత్రలో రుక్మిణి మోడ్రన్ డ్రస్‌లో పబ్‌లో నడుస్తూ లుక్ పూర్తిగా స్టైలిష్‌గా, పవర్‌ఫుల్ వైబ్‌తో ఆకట్టుకుంటోంది.
టాక్సిక్ కథ..
ఈ మూవీ గోవాలో ఉన్న డ్రగ్ కార్టెల్ చుట్టూ నడిచే యాక్షన్-ప్యాక్డ్ మాఫియా బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కుతున్నట్లు సమాచారం.1950ల నుంచి 1970ల మధ్య కాలానికి సంబంధించిన కథతో తెరకెక్కనుంది. అందుకు తగ్గట్టుగానే సెట్స్ డిజైన్ రిలీజ్ చేసిన పోస్టర్స్, విజువల్స్లో కనిపిస్తున్నాయి.
ALSO READ : రాజాసాబ్ లాంటి హారర్ ఫాంటసీ సినిమా చూసుండరు
అంతేకాకుండా ‘టాక్సిక్’ ఒక డార్క్, ఇంటెన్స్ పాన్ ఇండియా గ్యాంగ్‌స్టర్ డ్రామా. సమాజంలో లోతుగా పాతుకుపోయిన పవర్, హింస, లోభం, మానవ బలహీనతలు అనే అంశాల చుట్టూ కథ తిరుగుతుందని బలమైన టాక్. ముఖ్యంగా క్రైమ్, రాజకీయాలు, అండర్‌వల్డ్ నెట్‌వర్క్ వంటి అంశాలు చర్చించనున్నారు.
