Venkatesh: “అప్పుడు తమ్ముళ్లతో చేశా.. ఇప్పుడు అన్నయ్యతో వస్తున్నా!”–చిరు సినిమాపై వెంకీ స్పీచ్ వైరల్

Venkatesh: “అప్పుడు తమ్ముళ్లతో చేశా.. ఇప్పుడు అన్నయ్యతో వస్తున్నా!”–చిరు సినిమాపై వెంకీ స్పీచ్ వైరల్

క్రేజీ డైరెక్టర్ అనిల్ రావిపూడి దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటించిన ‘మన శంకరవరప్రసాద్ గారు’ చిత్రం జనవరి 12న ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది. పక్కా ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా రూపొందిన ఈ సినిమాలో చిరంజీవి మాజీ NIA ఆఫీసర్ పాత్రలో కనిపించనుండగా, లేడీ సూపర్‌స్టార్ నయనతార ‘శశిరేఖ’ పాత్రలో నటిస్తోంది. ఈ చిత్రంలో విక్టరీ వెంకటేష్ ప్రత్యేక కేమియో పాత్రలో కనిపించనుండటం సినిమాపై అంచనాలను భారీగా పెంచింది.

ఇప్పటికే చిరంజీవి–వెంకటేష్ కలిసి కనిపించిన మెగా విక్టరీ మాస్ సాంగ్ యూట్యూబ్‌లో ట్రెండింగ్‌లో కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో జనవరి 7న జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో విక్టరీ వెంకటేష్ చేసిన స్పీచ్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

ALSO READ : రాజాసాబ్ లాంటి హారర్ ఫాంటసీ సినిమా చూసుండరు

వెంకటేష్ మాట్లాడుతూ ‘చిరంజీవి గారితో వర్క్ చేయడం అద్భుతమైన ఎక్స్‌‌పీరియన్స్‌‌. ఇద్దరం రచ్చ చేశాం. గతంలో పవన్ కళ్యాణ్, మహేష్ లాంటి తమ్ముళ్లతో కలిసి మల్టీస్టారర్స్‌‌ చేసిన నేను.. ఇప్పుడు అన్నయ్యతో వస్తున్నా.. ప్రేక్షకుల నుంచి సౌండ్‌‌ అప్పటికంటే ఎక్కువ ఉండాలి’ అని అన్నారు.

డైరెక్టర్ అనిల్‌తో తనది మంచి కాంబినేషన్‌ అని, ఈ సినిమాకు మంచి టీమ్‌ పని చేసిందన్నారు. చివరగా.. ఈ సంక్రాంతి పండుగకి ఒక క్రేజీ ఎంటర్‌టైన్‌ ఫిల్మ్‌ రాబోతోందని, ఆడియన్స్ చూసి గ్రేట్ సక్సెస్ అందించాలని కోరారు. తెలుగు ఇండస్ట్రీ బాగుండాలంటే అన్ని సినిమాలు ఆడాలని, అప్పుడే అన్ని విభాగాల వారు బాగుంటారని వెంకీ కోరుకున్నారు.

ALSO READ : సంక్రాంతికి సమంత సర్‌‌‌‌‌‌‌‌ప్రైజ్..

ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో డైరెక్టర్ అనిల్ రావిపూడి, నిర్మాతలు సాహు గారపాటి, సుస్మిత, లిరిక్ రైటర్స్ రామజోగయ్య శాస్త్రి, అనంత శ్రీరామ్, కాసర్ల శ్యామ్, భాస్కరభట్ల, రఘురాం సహా చిత్రబృందం మొత్తం పాల్గొని సినిమాపై ఉన్న అంచనాలను మరింత పెంచారు.