Samantha: సంక్రాంతికి సమంత సర్‌‌‌‌‌‌‌‌ప్రైజ్.. చీరకట్టులో అదరగొట్టేసిన క్రేజీ లుక్

Samantha: సంక్రాంతికి సమంత సర్‌‌‌‌‌‌‌‌ప్రైజ్.. చీరకట్టులో అదరగొట్టేసిన క్రేజీ లుక్

సమంత లీడ్ రోల్‌‌‌‌లో నటిస్తున్న చిత్రం ‘మా ఇంటి బంగారం’. నందినీ రెడ్డి దర్శకత్వం వహిస్తున్నారు. సమంతకు చెందిన ట్రాలాలా మూవింగ్ పిక్చర్స్ బ్యానర్‌‌‌‌పై రాజ్ నిడిమోరు, హిమాంక్ దువ్వూరు నిర్మిస్తున్నారు.

బుధవారం ఈ మూవీ  టీజర్‌‌‌‌‌‌‌‌ రిలీజ్‌‌‌‌ డేట్‌‌‌‌ను అనౌన్స్‌‌‌‌ చేశారు. ‘మీరు చూస్తుండండి.. మా ఇంటి బంగారం మీ అందరితో కలిసిపోతుంది” అనే క్యాప్షన్‌‌‌‌తో జనవరి 9న ఉదయం 10 గంటలకు టీజర్‌‌‌‌‌‌‌‌ ట్రైలర్‌‌‌‌‌‌‌‌ను విడుదల చేయబోతున్నట్టు చెప్పారు.  

ఈ సందర్భంగా విడుదల చేసిన పోస్టర్‌‌‌‌‌‌‌‌లో.. చీరకట్టులో కనిపిస్తున్న సమంత ఆర్డినరి బస్సులో నిలబడి ఫెరోషియస్‌‌‌‌గా చూస్తోంది. డిఫరెంట్‌‌‌‌ ఎమోషన్స్‌‌‌‌తో బోల్డ్‌‌‌‌ అండ్ గ్రిప్పింగ్ ఫ్యామిలీ యాక్షన్ డ్రామాగా ఈ చిత్రం ఉండబోతోందని మేకర్స్‌‌‌‌ చెబుతున్నారు.

‘ఓ బేబి’ తర్వాత సమంత, నందినీ రెడ్డి కాంబినేషన్‌‌‌‌లో వస్తున్న చిత్రం కావడంతో ఆసక్తి నెలకొంది.  సంతోష్ నారాయణన్ సంగీతాన్ని అందిస్తుండగా ఓం ప్రకాష్ సినిమాటోగ్రాఫర్. దిగంత్, గుల్షన్ దేవయ్య, గౌతమి, మంజుషా కీలకపాత్రలు పోషిస్తున్నారు.