గవర్నర్‎ వ్యవహారంలో బీజేపీ తల దూర్చదు

గవర్నర్‎ వ్యవహారంలో బీజేపీ తల దూర్చదు

గవర్నర్ పట్ల తెలంగాణ ప్రభుత్వం తీరును బండి సంజయ్ వ్యతిరేకించారు. గవర్నర్ తమకు ఏజెంట్‎గా ఉండాలని టీఆర్ఎస్ కోరుకుంటోందని ఆయన అన్నారు. నాంపల్లి బీజేపీ కార్యాలయంలో ప్రెస్ మీట్ నిర్వహించిన బండి సంజయ్.. కేటీఆర్ కామెంట్స్ పై స్పందించాల్సిన అవసరం లేదని.. ఆయనో పిట్టల దొర లాంటివాడని ఎద్దేవాచేశారు.

‘గవర్నర్ వ్యవస్థ రాజ్యాంగ వ్యవస్థ. గవర్నర్ వ్యవస్థను ఏ ప్రభుత్వమైనా గౌరవించాల్సిందే. కేసీఆర్‎కు రాజ్యాంగం మీద నమ్మకం ఉంటే.. గవర్నర్ వ్యవస్థను గౌరవించాలి. ప్రభుత్వానికి, గవర్నర్‎కు జరుగుతోన్న వ్యవహారంలో బీజేపీ తల దూర్చదు. డ్రగ్స్ మఠాలను అరెస్టు చేయలేని వాడు దేశాన్ని బాగుచేస్తాడా? డ్రగ్స్ కేసుతో సంబంధం ఉన్న బీజేపీ వాళ్ళను సైతం అరెస్టు చేయాలని కోరుతున్నాను. కేసీఆర్ కు రంజాన్ పండుగంటే చాలా ఇష్టం. ఆ ఇష్టంతోనైనా ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు వెంటనే ఇవ్వాలి. యువమోర్చా ఆధ్వర్యంలో డ్రగ్స్ వ్యవహారంపై పోరాటాలు చేస్తాం’ అని బండి సంజయ్ హెచ్చరించారు.

For More News..

హైదరాబాద్ డ్రగ్స్‎కు అడ్డాగా మారడానికి కేసీఆరే కారణం

కరోనా బూస్టర్ డోస్ పై కేంద్రం కీలక నిర్ణయం