
హుస్నాబాద్: బీజేపీ అధికారంలోకి రాగానే అందరికీ ఉచిత విద్య, ట్రీట్‌మెంట్ అందిస్తామని బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ ప్రకటించారు. బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత సీఎం చేసే మొదటి సంతకం అదేనని ఆయన తేల్చి చెప్పారు. సంజయ్ చేపట్టిన ‘ప్రజా సంగ్రామ యాత్ర’ నేటితో ముగుస్తుండటంతో.. హుస్నాబాద్‌లో బహిరంగ సభను ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. సంజయ్ మాట్లాడుతుండగా.. కార్యకర్తలందరూ సీఎం.. సీఎం అంటూ అరుస్తుండటంతో ఆయన కలగచేసుకొని మాట్లాడారు. ఈ యాత్ర చేసేది సీఎం కావడానికి కాదు.. వేరేవాళ్లను సీఎంలను చేస్తాం అని సంజయ్ అన్నారు. ఈ సభ టీఆర్ఎస్ కు వీడ్కోలు సభ అని .. బీజేపీ మాత్రం స్వాగత సభ అని ఆయన అన్నారు.