ఆర్టీసీ ఛార్జీల పెంపు... సీఎం కుట్రలో భాగమే

ఆర్టీసీ ఛార్జీల పెంపు... సీఎం కుట్రలో భాగమే

ఆర్టీసీ ఛార్జీల పెంపుపై బీజీపీ నాయకులు చేపట్టిన ప్రయాణికులతో ముఖాముఖి కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పాల్గొన్నారు. ఈ నేపథ్యంలో వారితో మాట్లాడి, సమస్యలు తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన కేసీఆర్ పై పలు వ్యాఖ్యలు చేశారు. ఆర్టీసీ ఛార్జీలను ఐదు సార్లు ఐదు కారణాలు చెప్పి పెంచారన్న బండి సంజయ్.. 2018 తర్వాత ఈ తెలంగాణలో 60శాతానికి పైగా పెంచారని ఆరోపించారు. ఎంత మూర్ఖత్వమంటే.. ఇంతకుముందు రూ.200 కే కరీంనగర్ పోయేటోళ్లం. ఇప్పుడు రూ.300 వరకూ అవుతోందని అన్నారు.  నిన్న 40 నుంచి 60 శాతం పెంచారని, అసలు రాష్ట్ర ప్రభుత్వానికి ఎందుకింత కక్షనో తన కర్థం కావడం లేదని అన్నారు.  ఏ ఒక్క సమైక్య పాలనలో కూడా ఇలా పెంచలేదన్న ఆయన.. ఇదంతా ఆర్టీసీని ప్రైవేటుపరం చేయడంలో భాగంగా చేసే కుట్రనే అంటూ విమర్శించారు.

 గతంలో ఆరు వేల బస్సులు ఉండే. దాన్ని 4 వేలకు తగ్గించిండ్రు. ఇప్పటికి అది 3 వేలకు వచ్చింది. ప్రైవేటు బస్సులు ఇంతకుముందు 1200 నుంచి 1500 ఉండే. దాన్ని 3 వేలకు పెంచారు. ఇలా రాష్ట్ర ముఖ్యమంత్రి పెంచుతూ పోతే.. చివరికి ప్రయాణికులు ఎవరూ రారు, తిరగరు. కాబట్టి ఆర్టీసీ నడుస్త లేదు. ప్రైవేటు పరం చేయాలే అంటరని బండి సంజయ్ అన్నారు. ఇప్పటికే ఉన్న ఆస్తులన్నీ అమ్ముకుంటున్నరు టీఆర్ఎస్ పార్టీ వాళ్లు. ఇప్పుడు ప్రైవేటుపరం చేస్తున్నరు. ఆర్టీసీ నష్టాల్లో ఉందని గతం నుంచీ చెప్పుకుంటూ వస్తున్నడు. నేను ఆర్టీసీని లాభాల్లోకి వేస్తా, పోటు గాన్నీ, తోపు గాన్నీ ఆర్టీసీని ఆదుకుంటా అన్నాడు. రేపు ఈ కుట్రలో భాగంగా ఆర్టీసీ బస్సుల్లో ఎవరూ తిరుగతలేరు. అందుకే ప్రైవేటుపరం చేస్తున్నా అని చెప్పి ఆయన అనుచరులకో, పార్టీ కార్యకర్తలతో ఆర్టీసీని ధారాదత్తం చేసి, ఆర్టీసీని అధోగతిపాలు చేయడానికే రాష్ట్ర ముఖ్యమంత్రి కుట్రలో భాగమే ఇది అని బండి సంజయ్ నొక్కి చెప్పారు. అంతే కాకుండా పేద ప్రజలకోసం పోరాటం చేస్తామన్న బండి.. సామాన్య ప్రజల గొంతును ప్రగతిభవన్ వరకు తీసుకెళ్తామని, కేసీఆర్ కు నిద్ర లేకుండా చేస్తామని అన్నారు. తెలంగాణలో కల్వకుంట్ల అరాచకాన్ని  తరిమికొట్టేందుకు కృషి చేద్దామని ఆయన తన ట్విట్టర్ వేదికగా తెలిపారు.