లాఠీఛార్జ్, కేసులతో విద్యార్థులను ఆపలేరు

లాఠీఛార్జ్, కేసులతో విద్యార్థులను ఆపలేరు
ఉద్యోగ,ఉపాధ్యాయ,పెన్షనర్ల హక్కులపై బీజేపీ ఉద్యమానికి సిద్దమవుతోందన్నారు బీజేపీ స్టేట్ చీఫ్ బండి సంజయ్. సీఎంతో సమావేశమై ద్యోగ సంఘాల నేతలు స్పందించాలన్నారు. ప్రమోషన్లు లేక ఉపాధ్యాయులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు. నిజామాబాద్ స్థానిక ప్రజాప్రతినిధులు బండి సంజయ్ సమక్షంలో బీజేపీలో చేరారు.ఈ సందర్భంగా మాట్లాడిన సంజయ్ ..గ్రామ పంచాయతీలకు నిధులు ఇవ్వకుండా  ప్రభుత్వం సర్పంచ్ లతో ఆడుకుంటుందన్నారు. వరంగల్ కాకతీయ యూనివర్శిటీలో ఏబీవీపీ నాయకులపై పోలీసుల లాఠీఛార్జ్ ను బీజేపీ ఖండిస్తుందన్నారు. విద్యార్థుల సమస్యలపై పోరాటం చేస్తే ఏబీవీపీ నేతలపై లాఠీఛార్జ్ చేస్తారా? అని ప్రశ్నించారు. లాఠీఛార్జ్, కేసులతో విద్యార్థులను ఆపలేరన్నారు. ఎస్సీ విద్యార్థుల కోసం మోడీ ప్రభుత్వం పోస్ట్ మెట్రిక్ స్కాలర్ షిప్ తీసుకురావడం సంతోషకరమన్నారు. పీఎంఎస్ తో 4 కోట్ల మంది ఎస్సీ విద్యార్థులకు మేలు జరుగుతుందన్నారు.విద్యార్థుల స్కాలర్ షిప్స్ ల 60 శాతం కేంద్రమే ఇస్తుందన్నారు. ఢిల్లీలో ఆగని ఆందోళన.. లారీని ఇల్లుగా మార్చిన రైతు