
శ్రీ కృష్ణ జన్మాష్టమి సందర్భంగా హిందూ బంధువులకు శుభాకాంక్షలు అన్నారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్. పవిత్రాణాయ సాధూనం.. వినాశాయ చతుష్కృతాం.. ధర్మ సంస్థాపనార్దాయ సంభవామి యుగేయుగే’.. అన్న గీతా శ్లోకం కృష్ణావతార ప్రాశస్థ్యాన్ని వివరిస్తున్నదన్నారు. దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ చేసి ధర్మాన్ని పునరుద్ధరించడానికి వచ్చిన అవతార పురుషుడు శ్రీ కృష్ణుడని తెలిపారు. సామరస్యపూర్వక సమాజాన్ని నిర్మించడానికి శ్రీకృష్ణ జన్మాష్టమి ఒక పునాదని..సమాజంలో శాంతి, సోదరభావం, ప్రజా శ్రేయస్సు నెలకొల్పేందుకు ఈ శుభదినం ప్రతీకగా నిలుస్తుందన్నారు. కానీ, కరోనా నేపథ్యంలో నేడు నిడారంబరంగా వేడుకలు నిర్వహించుకుంటున్నమని తెలిపారు. ఇలాంటి పరిస్థితుల్లో భక్తులు తమ ఇళ్లలోనే చిన్నికృష్ణునికి స్వాగత సత్కారాలు చేసుకుందామని పిలుపునిచ్చారు. ఆ దేవుడు ప్రజలందరికీ ఆయురారోగ్యాలు ప్రసాదించాలని కోరుకుంటున్నానన్నారు బండి సంజయ్.