కేటీఆర్, కవిత సంపాదనలో ఒక్క శాతం ఖర్చు పెట్టినా రైతులకు మేలే : బండి సంజయ్

కేటీఆర్, కవిత సంపాదనలో ఒక్క శాతం ఖర్చు పెట్టినా రైతులకు మేలే : బండి సంజయ్

మంత్రి కేటీఆర్, ఎమ్మెల్సీ కవిత సంపాదనలో ఒక్క శాతం ఖర్చు పెట్టినా రైతులకు సాయం అందేదని బీజేపీ  తెలంగాణ చీఫ్ బండి సంజయ్ అన్నారు. కరీంనగర్ జిల్లాలోని కరీంనగర్, చొప్పదండి నియోజకవర్గాల్లో పంట నష్టపోయిన రైతులను పరామర్శించిన అనంతరం మీడియాతో మాట్లాడారు బండి సంజయ్.  ఫసల్ బీమా పరిహారం అమలు చేస్తే రైతులకు ఈ దుస్థితి వచ్చేది కాదన్నారు. కేసీఆర్ వల్ల రైతులు బిచ్చగాళ్ల లెక్క ప్రతిసారి అడుక్కోవాలా? అని ప్రశ్నించారు. 

వారంలో ఇస్తాననన్న పంట నష్టపరిహారం ఇంత వరకు ఎందుకు ఇవ్వలేదని బండి సంజయ్ ప్రశ్నించారు. కేసీఆర్ మాటలన్నీ కోతలేనన్నారు. ఏ రైతును కదిలించినా  కన్నీళ్లే వస్తున్నాయని. 8 ఏళ్లలో పంట నష్టపోయిన ఏ ఒక్క రైతు కుటుంబాన్నైనా ఆదుకున్నారా అని ప్రశ్నించారు బండి సంజయ్.

పంట కొనుగోలు కేంద్రాలను తెరిచినట్లయితే సగం మంది రైతులకు నష్టం జరగకపోయేది కాదన్నారు. కేంద్రం విపత్తుల కింద తెలంగాణకు  కేటాయించిన రూ.3 వేల కోట్లు ఏమయ్యాయని ప్రశ్నించారు. తక్షణమే పంట నష్టపోయిన రైతులకుఎకరాకు రూ. 20 వేల చొప్పున పరిహారం చెల్లించాలన్నారు. రైతులకు పరిహారం ఇచ్చే వరకు పోరాడతామన్నారు బండి సంజయ్.

https://www.youtube.com/watch?v=DVLAUjxtA3o