చొప్పదండి ఎమ్మెల్యేను పరామర్శించిన బండి సంజయ్

చొప్పదండి ఎమ్మెల్యేను పరామర్శించిన బండి సంజయ్

భార్యను కోల్పోయి బాధలో ఉన్న చొప్పదండి కాంగ్రెస్ ఎమ్మెల్యే మేడిపల్లి సత్యంను కరీంనగర్ ఎంపీ, కేంద్రమంత్రి బండి సంజయ్ పరామర్శించారు. అల్వాల్ పంచశీల కాలనీలో ఆయన నివాసానికి వెళ్లి ఆయన కుటుంబాన్ని ఓదార్చారు.   ఎమ్మెల్యే భార్య రూపాదేవి రెండు రోజుల క్రితం ఆత్మహత్య చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఎమ్మెల్యే కుటుంబాన్ని ఆయన పరామర్శించారు. సత్యం భార్య రుపాదేవి అకాల మరణం చెందడం బాధాకరమని బండి సంజయ్ అన్నారు.  వారి ఆత్మకు శాంతిచేకూరాలని  భగవంతుడిని ప్రార్థిస్తూ.. కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.