కుక్కలేమో పిల్లల్ని చంపితే.. వాళ్లేమో మనుషుల్ని చంపుతున్రు: బండి సంజయ్

కుక్కలేమో పిల్లల్ని చంపితే.. వాళ్లేమో మనుషుల్ని చంపుతున్రు: బండి సంజయ్

రాష్ట్రంలో రోజురోజుకి బీఆర్ఎస్ నేతల అరాచకాలు పెరిగిపోతున్నాయని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అన్నారు. బీఆర్ఎస్ దాడులను తీవ్రంగా ఖండిస్తున్నామని చెప్పారు. బీజేపీ నేత మురళీగౌడ్ కుటుంబసభ్యులను బండి సంజయ్ పరామర్శించారు. రెండు రోజుల క్రితం మురళీగౌడ్ ఇంటి పై ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి అనుచరులు దాడికి పాల్పడ్డారు. రాష్ట్రంలో కుక్కలేమో చిన్న పిల్లల్ని చంపుతుంటే.. బీఆర్ఎస్ వాళ్లేమో మనుషులను చంపుతున్నారని బండి సంజయ్ ఆరోపించారు. ఎదుటివారిపై దాడులు ఏ పార్టీ వాళ్లు చేసినా అది తప్పే అవుతుందన్నారు. మురళీగౌడ్ కుటుంబసభ్యులకు ఏమైనా అయితే బాధ్యులెవరని ప్రశ్నించారు. దాడులు జరుగుతుంటే పోలీసులు ఏం చేస్తున్నారని మండిపడ్డారు. బీఆర్ఎస్ నేతలు చేస్తున్న దాడులను ఆపడంలో విఫలమైన పోలీసులపై చర్యలు తీసుకోవాలని బండి సంజయ్ డిమాండ్ చేశారు.