బండి సంజయ్ Vs ఈటల ..ఇద్దరి మధ్య మరోసారి కోల్డ్ వార్..

బండి సంజయ్  Vs ఈటల ..ఇద్దరి మధ్య మరోసారి కోల్డ్ వార్..

కేంద్ర మంత్రి బండి సంజయ్, మల్కాజ్ గిరి ఎంపీ ఈటల రాజేందర్ మధ్య మరోమారు కోల్డ్ వార్ మొదలైందా..? నిన్న హిందూ ఓట్లు పోలరైజ్  కావాలంటూ  బండి సంజయ్ చేసిన  వ్యాఖ్యలను ఇవాళ ఈటెల రాజేందర్ వ్యతిరేకించడమే ఇందుకు నిదర్శనం.  జూబ్లీహిల్స్ లో హిందు ఓట్ల పొలరైజేషన్ జరగాల్సిందంటూ నిన్న కేంద్రమంత్రి బండి సంజయ్ వ్యాఖ్యలు చేశారు. హిందువులంతా ఓటు బ్యాంకుగా మారాలన్నారు. ఏపీ,తెలంగాణల్లో ఇతర మతాల్లో చేరిన వారు హిందూ మతంలోకి తిరిగి రావాలన్నారు. మతాలను మార్చుకుంటే దేవుళ్లను మోసం చేసినట్టేనని కూడా వ్యాఖ్యానించరు. సరిగ్గా 24 గంటలు గడవక ముందే ఈటల రాజేందర్ పరోక్షంగా కౌంటర్ ఇచ్చారు.

 'తెలంగాణలో డివిజన్ పాలిటిక్స్ నడవయ్..హిందూ, ముస్లింల ను విభజించి అధికారంలోకి రాలేము' అన్నారు. కులం మతం ప్రాతిపదికన చేసే రాజకీయాలు నిలబడవని అన్నారు. అభివృ ద్ధి ఎజెండాగా బీజేపీ రాజకీయం చేస్తుందని చెప్పారు. కేంద్రం ఇచ్చే పథకాల లబ్దిదారుల్లో ముస్లింలు, క్రిస్టియన్లు కూడా ఉన్నారని చెప్పు కొచ్చారు. రాజకీయ నాయకులను ప్రజలు మతం ప్రాతిపదికన చూడరని చెప్పారు. సబ్ కా సాత్ సబ్ కా వికాస్ మా మోదీ నినాద మని, బీహార్ లో అలాగే గెలిచామని చెప్పుకొ చ్చారు. అన్నీ చెప్పిన తర్వాత ఇది తన వ్యక్తిగత అభిప్రాయమని అనటం విశేషం. 

►ALSO READ | కవిత Vs హరీశ్..పేలుతున్న మాటల తూటాలు..

మరోమారు లడాయి

ఒకరు కేంద్రమంత్రి..మరొకరు ఎంపీ..! ఇద్దరిదీ ఒకే పార్టీ.. ఒకే ఉమ్మడి జిల్లాకు చెందిన వారు కూడా..! కాకపోతే కేంద్రమంత్రి.. కరీంనగర్ పార్లమెంట్ స్థానం నుంచి ప్రాతినిధ్యం వహిస్తుంటే.. మరోనేత మల్కాజ్ గిరి ఎంపీగా ఉన్నారు. గత కొంతకాలంగా వీరి మధ్య వర్గపోరు నడుస్తుండగా.. జూలైలో అది కాస్తా పీక్స్ కు చేరింది. హుజూరాబాద్ ప్రాంత నేతగా రాజకీయాల్లో ఎదిగిన ఈటల రాజేందర్ కు అక్కడి కేడర్ తో సత్సంబంధాలున్నాయి. ఆయన గత అసెంబ్లీ ఎన్నికల్లో హుజూరా బాద్ నుంచి పోటీ చేసి ఓటమి పాలయ్యారు. ఆ తర్వాత మల్కాజ్ గిరి ఎంపీగా గెలిచారు. ఇదే క్రమంలో హుజూరాబాద్ కార్యకర్తల తో కేంద్ర మంత్రి బండి సంజయ్ మీటింగ్ ఏర్పాటు చేయడం... దానికి ఈటల వర్గానికి సమాచారం ఇవ్వకపోడంతో ఇరు వర్గాలమధ్య గ్యాప్ పెంచింది. ఆ సమావేశంలో బండి సంజయ్ చేసిన కామెంట్స్ కూడా ఈటల వర్గా నికి నచ్చలేదు. దీంతో వారంతా మరుసటి రోజు శామీర్ పేటలోని ఈటల నివాసానికి చేరుకున్నారు. ఈ సందర్భంగా నిర్వహించిన సమావేశంలో ఈటల మాటల తూటాలు పేల్చారు.. ఆ తర్వాత భారీగా గ్యాప్ పెరిగింది. నిన్నబండి సంజయ్ చేసిన వ్యాఖ్యలకు విరు ద్ధంగా ఈటల చేసిన కామెంట్లు ఉండటంతో ఇద్దరు నేతల మధ్య మళ్లీ లడాయి మొదలయిం దనే చర్చ జరుగుతోంది.