కవిత Vs హరీశ్..పేలుతున్న మాటల తూటాలు..

కవిత Vs హరీశ్..పేలుతున్న  మాటల తూటాలు..

హరీశ్ టార్గెట్ గా ఎమ్మెల్సీ కవిత విమర్శలు చేస్తున్నారు. మాటల తూటాలు పేల్చుతున్నారు. హరీశ్ రావుకు బదులుగా బీఆ ర్ఎస్ ఎమ్మెల్యేలు చింత ప్రభాక ర్, కేపీ వివేకానంద తదితరులు వంది మాగధులు మాట్లాడుతుండ్రు రియాక్టయ్యారు. జూబ్లీహిల్స్ లో  ఓటమికి హరీశ్ రావే కారణ మంటూ కవిత చేసిన వ్యాఖ్యలు హాట్ టాపిక్ గా మారాయి. కృష్ణార్జునులు అనుకునే వాళ్లు ఒకరి జబ్బలు ఒకరు చరుచు కుంటున్నారని ఎద్దేవా చేశారు. బీఆర్ఎస్ ప్రతిపక్షంగా సరిగా పనిచేయకపోతే తామే ప్రధానప్రతిపక్షంగా ఎదుగుతామని చెప్పుకొచ్చారు. హరీశ్ రావుపై విమర్శలను సంగారెడ్డి ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ తిప్పి కొట్టారు. కేసీఆర్ కడుపున రాక్షసి పుట్టడం చాలా బాధాకరమని, హరీశ్ రావు గురించి మాట్లాడకపోతే కవితకు పొద్దు గడవడం లేదని అన్నారు

 కవిత.. రేవంత్ తో వ్యాపారాల కోసం ఇలా విమర్శలు చేస్తున్నారని, అందుకే లేనిపోని విమర్శలన్నీ గుప్పించే పని ముందు పెట్టుకున్నారని అన్నారు. కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే వివేకా నంద్ మాట్లాడుతూ.. కవిత పార్టీ పెట్టుకుంటే పెట్టుకోవాలని అన్నారు. పదేండ్లు బీఆర్ఎస్ లో ఉండి.. ఇప్పుడు కాంగ్రెస్ తో చేతులు కలిపారని అన్నారు. జూబ్లీహిల్స్ కు నాకు ఏం సంబంధం లేదని చెప్పిన కవిత.. ఇప్పుడు ఇలా మాట్లాడటం ఎంత వరకు సమంజసమన్నారు. ఆమె మాటలు కాంగ్రెస్ పార్టీకి లబ్ధి చేకూర్చేలా ఉన్నాయని అన్నారు. “ఎవరి ప్రయోజనం కోసం ఇలా వ్య వహరిస్తున్నారు? కేసీఆర్ కుమార్తెగా కవితను గౌరవిస్తున్నాం.. ఆ గౌరవాన్ని నిలబెట్టుకోవాలి. ఏదైనా మాట్లాడుతామంటే రియాక్షన్ కూడా అదే రీతిలో ఉంటుందన్న విషయాన్ని గుర్తెరగాలి.? అని అన్నారు.