
హైదరాబాద్, వెలుగు: రానున్న లోక్‌సభ ఎన్నికల్లో బీఆర్‌ఎస్ పార్టీ ఒక్క సీటు కూడా గెలవదని కాంగ్రెస్ నాయకుడు బండ్ల గణేశ్ అన్నారు. గాంధీ భవన్‌లో సోమవారం ఆయన మీడియాతో మాట్లా డారు. మాజీ మంత్రులు కేటీఆర్, హరీశ్‌రా వుకు ఈర్ష్య పీక్ స్టేజ్‌కు చేరిందని, అందు కే నోటికొచ్చినట్టు విమర్శలు చేస్తున్నారని ఫైర్ అయ్యారు. వంద రోజుల తర్వాత కాంగ్రెస్ పప్పులు ఉడకవని హరీశ్‌రావు చేసిన విమర్శలకు కౌంటర్‌గా, బిర్యానీ కూడా ఉడికించి చూపిస్తామన్నారు.
పదేం డ్లు అధికారంలో ఉండి రాష్ట్రాన్ని అభివృద్ధి చేయకుండా, 30 రోజులకే కాంగ్రెస్‌పై విమర్శలు చేయడం విడ్డూరంగా ఉంద న్నారు. ఇప్పుడే అవినీతి అధికారులను పక్కకు తప్పించి, నిజాయతీ గల అధికారు లను నియమించుకుని పాలన కొనసాగి స్తున్నామని, తమ ప్రభుత్వం అన్ని రాష్ట్రాలు మెచ్చుకునే విధంగా పరిపాలన చేస్తోందని అన్నారు. తమ పాలన ప్రజాపాలన అని, ప్రజలకు అందుబాటులో మంత్రులు, ముఖ్యమంత్రి ఉంటున్నారని ఆయన పేర్కొన్నారు.