కొత్త బ్యానర్తో నిర్మాతగా బండ్ల గణేష్ రీఎంట్రీ

కొత్త బ్యానర్తో నిర్మాతగా బండ్ల గణేష్ రీఎంట్రీ

నటుడిగా కెరీర్ ప్రారంభించి నిర్మాతగా మారిన బండ్ల గణేష్.. పరమేశ్వర ఆర్ట్ ప్రొడక్షన్స్ బ్యానర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పై ఆంజనేయులు,  గబ్బర్ సింగ్‌‌‌‌‌‌‌‌, బాద్‌‌‌‌‌‌‌‌ షా,  టెంపర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ లాంటి సినిమాలను నిర్మించిన విషయం తెలిసిందే. ఇప్పుడు ఆయన నిర్మాతగా రీఎంట్రీకి రెడీ అవుతున్నారు.

‘బండ్ల గణేష్ బ్లాక్‌‌‌‌‌‌‌‌బస్టర్స్’ పేరుతో తన కొత్త నిర్మాణ సంస్థను ఆయన ప్రకటించారు. ఈ సంస్థలో ఇప్పటికే ఓ ప్రాజెక్ట్‌‌‌‌‌‌‌‌ కన్‌‌‌‌‌‌‌‌ఫర్మ్ కాగా,  త్వరలోనే ఆ వివరాలను వెల్లడిస్తామన్నారు.  మనసుకు హత్తుకునే నిజాయతీతో కూడిన కథలు, కంటెంట్ రీచ్ సినిమాలను ప్రేక్షకులకు అందించాలనే లక్ష్యంతో, ఫ్రెష్‌‌‌‌‌‌‌‌ టాలెంట్‌‌‌‌‌‌‌‌ను ప్రోత్సహిస్తూ ఈ బ్యానర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ముందుకెళ్తుందని ఈ సందర్భంగా బండ్ల గణేష్‌‌‌‌‌‌‌‌ తెలియజేశారు.