నా టైటిల్‌ కొట్టేశారు...NTR సినిమాపై బండ్ల సంచలన ట్వీట్‌

నా టైటిల్‌ కొట్టేశారు...NTR  సినిమాపై బండ్ల సంచలన ట్వీట్‌

యంగ్ టైగర్ ఎన్టీఆర్‌ హీరోగా  కొరటాల శివ దర్శకత్వంలో ఓ పవర్‌ఫుల్‌ యాక్షన్ థ్రిల్లర్‌ మూవీ  తెరకెక్కుతోంది. NTR30 అనే వర్కింగ్‌ టైటిల్‌తో ఈ చిత్రం ప్రచారంలో ఉంది. 2023, మే 20న ఎన్టీఆర్‌ పుట్టినరోజు సందర్భంగా సినిమాకు సంబంధించిన టైటిల్‌ ను ప్రకటించనున్నారని తెలుస్తోంది. సోషల్‌ మీడియాలో మాత్రం  ఈ సినిమాకు ‘దేవర’ (devara) అనే టైటిల్‌ను ఫిక్స్‌ చేశారనే టాక్‌ జోరుగా వినిపిస్తోంది. 

అయితే ఈ టైటిల్‌ పై ప్రముఖ నిర్మాత  బండ్ల గణేష్‌ సంచలన ట్వీట్‌ చేశారు.  ‘‘దేవర.. నేను రిజిస్ట్రేషన్‌ చేయించుకున్న నా టైటిల్‌. నేను మర్చిపోవడం వల్ల.. నా టైటిల్‌ను కొట్టేశారు’’ అని ముందుగా ట్వీట్ చేశాడు గణేష్... ఆ తర్వాత కొద్దిసేపటికి ‘నాకేం ప్రాబ్లం లేదు బ్రదర్‌. ఇది మన యంగ్‌ టైగర్‌ సినిమాకే కదా. ఆయన కూడా నాకు దేవరే’ అంటూ  మరో ట్వీట్ వదిలాడు. 
 
చిత్ర యూనిట్‌ ఇంకా ఈ టైటిల్‌ ను  అధికారికంగా ప్రకటించనప్పటికీ  ఎన్టీఆర్‌  అభిమానులు ఈ టైటిల్‌ తో ఇమేజ్‌లు తయారు చేసి సోషల్‌ మీడియాలో షేర్‌ చేసేస్తున్నారు. ఇక ఈ సినిమాలో ఎన్టీఆర్‌ సరసన జాన్వీ కపూర్‌ నటిస్తుండగా, విలన్ గా  బాలీవుడ్‌ స్టార్ హీరో సైఫ్‌ అలిఖాన్‌ కనిపించనున్నాడు. అనిరుధ్ సంగీతాన్ని అందిస్తున్నాడు.  ఆర్ఆర్ఆర్ లాంటి భారీ హిట్ తరువాత ఎన్టీఆర్‌ నుంచి వస్తోన్న సినిమా కావడంతో ఈ చిత్రంపై భారీ అంచనాలున్నాయి.  

అటు బండ్ల గణేష్, ఎన్టీఆర్‌ కాంబోలో రెండు చిత్రాలు వచ్చాయి. బాద్షా, టెంపర్ చిత్రాలు వీరి కాంబోలో వచ్చి సూపర్ హిట్ అందుకున్నాయి.