గండిపేట, వెలుగు: ప్రకటనల హోర్డింగ్‌లకు ప్రత్యేక లైటింగ్ ఏర్పాటు చేసి వెలుగులు నింపుతున్న అధికారులు.. జనాలు ప్రయాణించే మెయిన్రోడ్లపై స్ట్రీట్లైట్ల గురించి పట్టించుకోవడం లేదు. రాజేంద్రనగర్ సర్కిల్ పరిధిలోని బండ్లగూడ జాగీర్ చౌరస్తా నుంచి టిప్పు ఖాన్ బ్రిడ్జి వరకు ఉన్న మెయిన్‌రోడ్డుపై కొద్ది రోజులుగా స్ట్రీట్‌లైట్లు వెలగడం లేదు.
ఈ రూట్లో రోడ్డు పక్కనే ఉండే అడ్వర్టైజ్మెంట్హోర్డింగ్లకు మాత్రం స్పెషల్లైటింగ్ఏర్పాటు చేశారు. దీంతో అవి ధగధగలాడుతుండగా..రోడ్లపై మాత్రం కటిక చీకటి రాజ్యమేలుతోంది. రాత్రి ఈ రూట్లో రోడ్డు పక్కనున్న దుకాణాల ముందు ఏర్పాటు చేసిన లైట్ల వెలుతురులో రోడ్డుపై ఎక్కడ గుంత ఉందోనని చూసుకుంటూ వెళ్లాల్సి వస్తున్నది. కనీసం దీపావళి లోపైనా స్ట్రీట్‌లైట్లు వెలిగేలా చర్యలు తీసుకోవాలని వాహనదారులు విజ్ఞప్తి చేస్తున్నారు.
