
నేడు ఉదయం బ్యాంకాక్‌లోని చతుచక్‌లోని ఓర్ టోర్ కోర్ మార్కెట్‌లో ఓ గుర్తు తెలియని వ్యక్తి ఒక్కసారిగా కాల్పులకి తేగబడ్డాడు. దింతో కాన్ జోమ్ ఫలాంగ్ డొనేషన్ సెంటరు సమీపంలో జరిగిన ఈ ఘటనలో కనీసం 6 మంది మరణించగా, చాల మంది గాయపడ్డారు.
เลวมากๆ มือกราดยิง ตลาด อตก คือสงสาร รปภ ที่เสียชีวิตมากครับ แค่ค่าแรงก็น้อยอยู่แล้ว ยืนตากแดด ทำงานเกินค่าแรง แล้วมันมายิงเขาอีก คนแบบนี้ไม่ต้องไปเบลอหน้ามันครับ แม้มันจะยิงตัวเองไปแล้วก็ต้องประนามมันครับไม่ต้องปกป้องมัน เป็นที่ ตปท เขาโพสประจานยาว#ตลาดอตก #ไทยกัมพูชา #กราดยิง pic.twitter.com/rmlHjJFu6D
— Virus Studio (ไวรัสสตูดิโอ) (@Virusstudio2531) July 28, 2025
అయితే ఈ కాల్పుల్లో ఆరుగురు మరణించినట్లు నిర్ధారించామని, వారిలో ఆత్మహత్య చేసుకున్న దుండగుడు కూడా ఉన్నాడని మెట్రోపాలిటన్ పోలీస్ బ్యూరో డిప్యూటీ కమిషనర్ తెలిపారు. మొత్తం మృతులలో నలుగురు భద్రతా సిబ్బంది, ఒక మహిళ, కాల్పులు జరిపిన వ్యక్తి కూడా ఉన్నట్లు ఓ పోలీస్ అధికారి చెప్పారు.
ตายห่าแล้วคร่ะอิดอก
— Redeye191 News (@yingluck_FC) July 28, 2025
ยิงตัวเองตายหลังยิงกราดจุดรับบริจาคคุณกันจอมพลังที่ อตก.#ยิงกราดอตก pic.twitter.com/SVW8Du8rIM
ఈ సంఘటన వ్యవసాయ మార్కెట్ సంస్థ ఫ్రెష్ మార్కెట్ జోన్‌లో జరగడంతో అక్కడున్న వారిలో భయాందోళనలు నెలకొన్నాయి. సమాచారం ప్రకారం నల్ల టీ-షర్టు, ఆర్మీ షార్ట్స్ ధరించి బ్యాక్‌ప్యాక్‌తో ఉన్న వ్యక్తి హ్యాండ్‌గన్ ఉపయోగించి ఈ దాడి చేసాడు. కాల్పుల తర్వాత, అతను సంఘటనా స్థలం దగ్గర తిరుగుతూ పక్కన ఉన్న కుర్చీపై కూర్చుని అదే గన్నుతో కాల్చుకుని చనిపోయాడు.
28 ก.ค. 2568 ได้รับแจ้งจากทีมงานว่า มีชายรายหนึ่งใช้อาวุธปืนกราดยิงประชาชนไทยภายในตลาด องค์การตลาดเพื่อเกษตรกร (ตลาด อตก.) ศูนย์รับบริจาคทีมงาน กันจอมพลัง
— SecretNewsAgency (@SNews_Agency) July 28, 2025
จากการตรวจสอบพบคนร้าย ชื่อ นายน้อย (สงวนนามสกุล) อายุ 61 ปี เป็นชาว อ.คง จ.นครราชสีมา เคยทำงานเป็นรปภ. บริษัทเดียวกับ… pic.twitter.com/5YcpOHHA0k
ఈ కాల్పులకి సంబంధించిన వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. పోలీసులు ఆ ప్రాంతాన్ని తమ ఆధీనంలోకి తీసుకుని దర్యాప్తు ప్రారంభించగా, ఈ దారుణమైన దాడి వెనుక గల కారణాలు ఇంకా స్పష్టంగా తెలియలేదు. అయితే మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.