217 పరుగుల‌‌‌‌‌‌‌ భారీ తేడాతో ఐర్లాండ్‎ను చిత్తు చేసిన బంగ్లా.. రెండు మ్యాచుల టెస్ట్ సిరీస్ క్లీన్ స్వీప్

217 పరుగుల‌‌‌‌‌‌‌ భారీ తేడాతో ఐర్లాండ్‎ను చిత్తు చేసిన బంగ్లా.. రెండు మ్యాచుల టెస్ట్ సిరీస్ క్లీన్ స్వీప్

మీర్పూర్‌‌‌‌‌‌‌‌: భారీ టార్గెట్‌‌‌‌‌‌‌‌ ఛేజింగ్‌‌‌‌‌‌‌‌లో ఐర్లాండ్‌‌‌‌‌‌‌‌ను అద్భుతంగా కట్టడి చేసిన బంగ్లాదేశ్‌‌‌‌‌‌‌‌.. రెండు మ్యాచ్‌‌‌‌‌‌‌‌ల టెస్ట్‌‌‌‌‌‌‌‌ సిరీస్‌‌‌‌‌‌‌‌ను 2–0తో క్లీన్‌‌‌‌‌‌‌‌ స్వీప్‌‌‌‌‌‌‌‌ చేసింది. బౌలింగ్‎లో తైజుల్‌‌‌‌‌‌‌‌ ఇస్లామ్‌‌‌‌‌‌‌‌ (4/104), హసన్‌‌‌‌‌‌‌‌ మురాద్‌‌‌‌‌‌‌‌ (4/44) రాణించడంతో ఆదివారం ముగిసిన రెండో టెస్ట్‌‌‌‌‌‌‌‌లోనూ బంగ్లా 217 రన్స్‌‌‌‌‌‌‌‌ భారీ తేడాతో ఐర్లాండ్‌‌‌‌‌‌‌‌ను చిత్తు చేసింది. 509 రన్స్‌‌‌‌‌‌‌‌ లక్ష్య ఛేదనలో 176/6 ఓవర్‌‌‌‌‌‌‌‌నైట్‌‌‌‌‌‌‌‌ స్కోరుతో ఐదో రోజు ఆట కొనసాగించిన ఐర్లాండ్‌‌‌‌‌‌‌‌ రెండో ఇన్నింగ్స్‌‌‌‌‌‌‌‌లో 113.3 ఓవర్లలో 291 రన్స్‌‌‌‌‌‌‌‌కు ఆలౌటైంది. 

కుర్టిస్‌‌‌‌‌‌‌‌ క్యాంపర్‌‌‌‌‌‌‌‌ (71 నాటౌట్‌‌‌‌‌‌‌‌) రాణించగా.. ఆండీ మెక్‌‌‌‌‌‌‌‌బ్రైన్‌‌‌‌‌‌‌‌ (21), జోర్డాన్‌‌‌‌‌‌‌‌ నీల్‌‌‌‌‌‌‌‌ (30), గవిన్‌‌‌‌‌‌‌‌ హోయ్‌‌‌‌‌‌‌‌ (37) బంగ్లా విజయాన్ని ఆలస్యం చేశారు. తన వందో టెస్ట్‌‌‌‌‌‌‌‌లో సెంచరీతో ఆకట్టుకున్న ముష్ఫికర్‌‌‌‌‌‌‌‌ రహీమ్‌‌‌‌‌‌‌‌కు ‘ప్లేయర్‌‌‌‌‌‌‌‌ ఆఫ్‌‌‌‌‌‌‌‌ ద మ్యాచ్‌‌‌‌‌‌‌‌’, సిరీస్‌‌‌‌‌‌‌‌లో 13 వికెట్లు తీసిన తైజుల్‌‌‌‌‌‌‌‌ ఇస్లామ్‌‌‌‌‌‌‌‌కు ‘ప్లేయర్‌‌‌‌‌‌‌‌ ఆఫ్‌‌‌‌‌‌‌‌ ద సిరీస్‌‌‌‌‌‌‌‌’ అవార్డులు లభించాయి. టెస్ట్‌‌‌‌‌‌‌‌ల్లో 250 వికెట్లు తీసిన తొలి బంగ్లా బౌలర్‌‌‌‌‌‌‌‌గా తైజుల్‌‌‌‌‌‌‌‌ ఇస్లామ్‌‌‌‌‌‌‌‌ రికార్డులకెక్కాడు.