చరిత్ర సృష్టించిన బంగ్లాదేశ్.. శ్రీలంకలో తొలిసారి టీ20 సిరీస్ కైవసం

 చరిత్ర సృష్టించిన బంగ్లాదేశ్.. శ్రీలంకలో తొలిసారి టీ20 సిరీస్ కైవసం

కొలంబో: చిన్న టార్గెట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఛేజింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో తన్జిద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ హసన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ (47 బాల్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో 1 ఫోర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, 6 సిక్సర్లతో 73 నాటౌట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌), లిటన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ దాస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ (26  బాల్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో 2 ఫోర్లు, 1 సిక్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో 32) చెలరేగడంతో.. బుధవారం జరిగిన మూడో టీ20లో బంగ్లాదేశ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ 8 వికెట్ల తేడాతో శ్రీలంకపై గెలిచింది. దాంతో మూడు మ్యాచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ల సిరీస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను 2–1తో సొంతం చేసుకుంది. ఫలితంగా తొలిసారి శ్రీలంకలో టీ20 సిరీస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ గెలిచి రికార్డు సృష్టించింది. టాస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ గెలిచిన శ్రీలంక 20 ఓవర్లలో 132/7 స్కోరు చేసింది. పాథుమ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ నిశాంక (39 బాల్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో 4 ఫోర్లతో 46) టాప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ స్కోరర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌. దాసున్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ షనక (35 నాటౌట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌), కమిందు మెండిస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ (21) కూడా రాణించారు. 

స్టార్టింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ నుంచే బంగ్లా బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చేయడంతో లంక టాపార్డర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కుప్పకూలింది. కుశాల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ మెండిస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ (6), కుశాల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పెరీరా (0), దినేశ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చండిమల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ (4), కెప్టెన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చరిత్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అసలంక (3) ఫెయిలయ్యారు. బంగ్లా బౌలర్లలో మెహిదీ హసన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ 4, షోరిఫుల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఇస్లామ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, ముస్తాఫిజుర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, షమీమ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ హుస్సేన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ తలో వికెట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ తీశారు. ఛేజింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో బంగ్లాదేశ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ 16.3 ఓవర్లలో 133/2 స్కోరు చేసి నెగ్గింది. ఇన్నింగ్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ తొలి బాల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కే నువాన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ తుషార (1/25).. పర్వేజ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ హోసేన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఎమన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ (0)ని డకౌట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చేశాడు. ఫలితంగా 1/0 స్కోరుతో క్రీజులోకి వచ్చిన తన్జిద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అద్భుతంగా ఆడాడు. 

లంక బౌలర్లను లక్ష్యంగా చేసుకుని ఆరు భారీ సిక్సర్లు బాదాడు. రెండో ఎండ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో లిటన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ దాస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ మంచి సహకారం అందించాడు. ఈ ఇద్దరు రెండో వికెట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు 50 బాల్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో 74 రన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ జత చేసి బంగ్లాను విజయం వైపు తీసుకెళ్లారు. లిటన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ దాస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఔటైనా.. తర్వాత వచ్చిన తౌహిద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ హ్రిదోయ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ (27 నాటౌట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌)తో కలిసి తన్జిద్ జట్టును గెలిపించాడు. మెహిదీ హసన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు ప్లేయర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఆఫ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ద మ్యాచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, లిటన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ దాస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు ప్లేయర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఆఫ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ద సిరీస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అవార్డులు లభించాయి.