- బంగ్లాదేశ్‌లో మరో హిందువు హత్య
ఢాకా: అరటి పండ్లు కనిపించకుండా పోవడంతో మొదలైన వివాదంకాస్తా చంపేదాకా వెళ్లింది. తమకు చెందిన పండ్ల గెల దొంగిలించాడంటూ బంగ్లాదేశ్‌లో 55 ఏండ్ల హిందూ వ్యాపారిని స్థానిక కుటుంబం కొట్టి చంపేసింది. గాజీపూర్ జిల్లాలో ఆదివారం ఈ దారుణం జరిగింది. స్థానికుడైన స్వపన్ మియా అరటితోట పెంచుతూ బిజినెస్ చేస్తున్నాడు.
శనివారం తన ఇంటిదగ్గరున్న అరటిపండ్లలోంచి ఒక గెల ఎవరో ఎత్తుకెళ్లారని స్వపన్ మియా(55) పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఆ మరుసటి రోజు ఆదివారం అరటి గెల.. మియా ఇంటిదగ్గరే ఉన్న లిటన్ చంద్ర ఘోష్ (55) అనే హిందూ వ్యాపారికి చెందిన స్వీట్ అండ్ మీట్ హోటల్‌లో కనిపించింది.
దీంతో చంద్రఘోష్‌ను మియాతోపాటు అతడి భార్య, 28 ఏండ్ల కొడుకు మాసుమ్ వాగ్వాదానికి దిగారు. అదే కోపంలో మాసుమ్.. చంద్రఘోష్‌పై దాడి చేశాడు. అతడు కొట్టిన పిడిగుద్దులు, తన్నులకు చంద్రఘోష్ అక్కడే కుప్పకూలి ప్రాణాలు విడిచాడు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసి నిందితులు ముగ్గురినీ అరెస్ట్ చేశారు.
