మీర్పూర్: ఐర్లాండ్‌తో జరుగుతున్న రెండో టెస్ట్‌లో బంగ్లాదేశ్ గెలుపు దిశగా సాగుతోంది. బంగ్లా నిర్దేశించిన 509 రన్స్‌ను ఛేదించడానికి శనివారం నాలుగో రోజు బరిలోకి దిగిన ఐర్లాండ్ ఆట ముగిసే టైమ్‌కు రెండో ఇన్నింగ్స్‌లో 54 ఓవర్లలో 176/6 స్కోరు చేసింది. హ్యారీ టెక్టర్ (50), కుర్టిస్ క్యాంపెర్ (34) మినహా మిగతా వారు నిరాశపర్చారు. తైజుల్ ఇస్లామ్ 3, హసన్ మురాద్ రెండు వికెట్లు తీశారు. అంతకుముందు 156/1 ఓవర్‌నైట్ స్కోరుతో రెండో ఇన్నింగ్స్ కొనసాగించిన బంగ్లాదేశ్ 69 ఓవర్లలో 297/4 స్కోరు వద్ద డిక్లేర్ చేసింది.
దీంతో ఐర్లాండ్ ముందు 509 రన్స్ లక్ష్యాన్ని ఉంచింది. మోమినల్ హక్ (87), షాద్మాన్ ఇస్లామ్ (78), మహ్మదుల్ హసన్ జాయ్ (60), ముష్ఫికర్ రహీమ్ (53 నాటౌట్) మెరుగ్గా ఆడారు. గవిన్ హోయ్ 2 వికెట్లు పడగొట్టాడు. ప్రస్తుతం ఒక్క రోజు ఆట మిగిలి ఉన్న ఈ మ్యాచ్‌లో ఐర్లాండ్ గెలవాలంటే ఇంకా 333 రన్స్ చేయాల్సి ఉంది. చేతిలో నాలుగు వికెట్లు ఉన్నాయి.
