ఢాకా: బౌలింగ్‌లో నహీద్ రాణా (5/40) చెలరేగడంతో.. పాకిస్తాన్‌తో మంగళవారం ముగిసిన తొలి టెస్ట్‌లో బంగ్లాదేశ్ 104 రన్స్ తేడాతో గెలిచింది. దాంతో రెండు మ్యాచ్‌ల సిరీస్‌లో 1–0 ఆధిక్యంలో నిలిచింది. బంగ్లా నిర్దేశించిన 268 రన్స్ ఛేదనలో పాకిస్తాన్ రెండో ఇన్నింగ్స్‌లో 52.5 ఓవర్లలో 163 రన్స్‌కే ఆలౌటైంది. అబ్దుల్లా ఫజల్ (66) టాప్ స్కోరర్. సల్మాన్ ఆగా (26), అజాన్ అవైస్ (15), సౌద్ షకీల్ (15), మహ్మద్ రిజ్వాన్ (15) కాసేపు పోరాడి విఫలమయ్యారు.
టస్కిన్ అహ్మద్, తైజుల్ ఇస్లామ్ చెరో రెండు వికెట్లు తీశారు. అంతకుముందు 152/3 ఓవర్‌నైట్ స్కోరుతో ఐదో రోజు ఆట కొనసాగించిన బంగ్లాదేశ్ రెండో ఇన్నింగ్స్‌ను 70.3 ఓవర్లలో 240/9 స్కోరు వద్ద డిక్లేర్ చేసింది. దాంతో పాక్ ముందు 268 రన్స్ లక్ష్యాన్ని ఉంచింది. నజ్ముల్ షాంటో (87), ముష్ఫికర్ రహీమ్ (22), మెహిదీ హసన్ (24) ఫర్వాలేదనిపించారు.
హసన్ అలీ, నోమన్ అలీ చెరో మూడు, షాహీన్ ఆఫ్రిది 2 వికెట్లు తీశారు. నజ్ముల్ షాంటోకు ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు లభించింది. ఇరుజట్ల మధ్య రెండో టెస్ట్ శనివారం నుంచి సిల్హెట్‌లో జరుగుతుంది.
