మా దేశ విముక్తి కోసం మద్దతిచ్చిన భారత ప్రజలకు కృతజ్ఞతలు

మా దేశ విముక్తి కోసం మద్దతిచ్చిన భారత ప్రజలకు కృతజ్ఞతలు

1971యుద్ధంలో విజయాన్ని అందించి బంగ్లాదేశ్‌ అవతరణకు వీరోచితంగా పోరాడిన భారత్‌కు ఆ దేశ ప్రధాని షేక్‌ హసీనా కృతజ్ఞతలు తెలియజేశారు. భారత్ తమ నిజమైన మిత్రదేశమంటూ బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా అన్నారు. 1971యుద్ధంలో విజయాన్ని అందించి.. బంగ్లాదేశ్‌ అవతరణకు వీరోచితంగా పోరాడిన భారత్‌కు కృతజ్ఞతలు తెలియజేశారు.

పాకిస్తాన్ పై విజయం సాధించి 50 ఏళ్లు కావొస్తున్నసందర్భంగా బుధవారం జాతీయ యుద్ధ స్మారకం దగ్గర విజయ్‌ దివస్ వేడుకలు జరిగాయి. ఈ విజయాన్ని గుర్తు చేసుకుంటూ  ఇవాళ(గురువారం) భారత్‌, బంగ్లాదేశ్ ప్రధానులు ద్వైపాక్షిక వర్చువల్ సదస్సులో మాట్లాడారు.

యుద్ధంలో ప్రాణాలు కోల్పోయిన 30 లక్షల మంది అమరవీరులకు నివాళులు అర్పిస్తున్నానన్నారు ప్రధాని హసీనా. భారత సాయుధ దళాల సభ్యులు, వారి కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను అన్నారు. మా దేశ విముక్తి కోసం హృదయపూర్వక మద్దతు ఇచ్చిన భారత ప్రభుత్వం, భారత ప్రజలకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నానన్నారు.

బంగ్లాదేశ్ విజయానికి గుర్తుగా విజయ్‌ దివస్ జరుపుకోవడం గర్వంగా ఉందన్నారు ప్రధాని మోడీ. తనను బంగ్లాదేశ్‌ పర్యటనకు ఆహ్వానించడంపైనా ఆయన హసీనాకు కృతజ్ఞతలు తెలియజేశారు. అంతేకాకుండా ఆ సమయంలో అమరవీరులకు నివాళులు అర్పించే అవకాశం రావడాన్నిగౌరవంగా భావిస్తున్నానని తెలిపారు.