ఢాకా/న్యూఢిల్లీ: మాజీ ప్రధానమంత్రి షేక్ హసీనాను న్యాయపరమైన ప్రక్రియల ద్వారానే స్వదేశానికి రప్పించాలనుకుంటున్నట్లు బంగ్లాదేశ్ హోం మంత్రి సలావుద్దీన్ అహ్మద్ స్పష్టం చేశారు. మరణశిక్ష పడినప్పటికీ తాను త్వరలోనే సగర్వంగా తిరిగొస్తానని, ప్రవాసం నుంచే అవామీ లీగ్‌ను నడిపిస్తానని హసీనా ఇటీవల కొన్ని భారతీయ మీడియా సంస్థలతో పేర్కొన్నారు.
ఈ వ్యాఖ్యలపై స్పందించిన హోం మంత్రి, ఆమె రాకకు ఎలాంటి న్యాయపరమైన అడ్డంకులు లేవన్నారు. ప్రధాని తారిఖ్ రెహమాన్ సలహాదారు జహేదుర్ రెహమాన్ సైతం హసీనాపై ఎలాంటి చట్టవ్యతిరేక చర్యలు ఉండవని కానీ ఆమె న్యాయవ్యవస్థకు లొంగిపోయి విచారణ ఎదుర్కోవాలని సూచించారు.
