ఢాకా: బంగ్లాదేశ్ వణికిపోతుంది చూస్తుండని తన గర్ల్ ఫ్రెండ్ కు ఉస్మాన్ హాది షూటర్ ముందే చెప్పాడు. ప్రధాన నిందితుడైన ఫైసల్ కరీం తన లవర్ మరియా అక్తర్ లిమాకు దీని గురించి ముందే చెప్పాడని స్థానిక పత్రికలు పేర్కొంటున్నాయి. అందువల్ల ఈ హత్యకు ముందుగానే ప్లాన్ వేసినట్టు పోలీసులు అనుమానిస్తున్నారు. శుక్రవారం ఫైసల్, అతడి ఇద్దరు సహచరులు ఢాకాలో పట్టపగలే విద్యార్థి నాయకుడైన షరీఫ్ ఉస్మాన్ హాదిని కాల్చి చంపేశారు.
అతడి పరిస్థితి విషమంగా ఉండటంతో సింగపూర్ కు తరలించారు. అక్కడి ఆస్పత్రిలోనే చికిత్స పొందుతూ హాది మరణించారు. అతడి మరణంతో బంగ్లాదేశ్ అంతటా హింస చెలరేగింది. నిరసనకారులు రోడ్డెక్కడంతో పరిస్థితి ఉద్రిక్తతంగా మారింది. మీడియా సంస్థలు, సాంస్కృతిక కేంద్రాలను నిరసనకారులు తగులబెట్టారు. షేక్ ముజిబుర్ రెహ్మాన్ నివాసాన్ని కూడా ధ్వంసం చేశారు.
