
ఆసియా కప్ లో గురువారం (సెప్టెంబర్ 25) అనధికారిక సెమీ ఫైనల్ ఫైట్ కు పాకిస్థాన్, బంగ్లాదేశ్ జట్లు సిద్ధమయ్యాయి. దుబాయ్ వేదికగా దుబాయ్ ఇంటర్నేషనల్ స్టేడియంలో జరగనున్న ఈ మ్యాచ్ లో బంగ్లాదేశ్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. ప్లేయింగ్ 11 విషయానికి వస్తే పాకిస్థాన్ ఎలాంటి మార్పులు చేయలేదు. మరోవైపు బంగ్లాదేశ్ మూడు మార్పులతో బరిలోకి దిగుతుంది. కెప్టెన్ లిటన్ దాస్ దూరం కావడం బంగ్లాకు ఎదురు దెబ్బ కానుంది. టోర్నీలో ఇప్పటికే టీమిండియా రెండు విజయాలతో టీమిండియా ఫైనల్ బెర్త్ కన్ఫర్మ్ చేసుకుంది. నేడు బంగ్లా, పాక్ లలో విజేతగా నిలిచిన జట్టు ఆదివారం (సెప్టెంబర్ 28) ఫైనల్ లో ఇండియా తో తలపడుతుంది.
బంగ్లాదేశ్ (ప్లేయింగ్ XI):
సైఫ్ హసన్, పర్వేజ్ హొస్సేన్ ఎమోన్, తౌహిద్ హృదయ్, షమీమ్ హొస్సేన్, జాకర్ అలీ (కెప్టెన్, వికెట్ కీపర్), నూరుల్ హసన్, మహేదీ హసన్, రిషద్ హొస్సేన్, తస్కిన్ అహ్మద్, తాంజిమ్ హసన్ సాకిబ్, ముస్తాఫిజుర్ రెహ్మాన్
పాకిస్థాన్ (ప్లేయింగ్ XI):
సాహిబ్జాదా ఫర్హాన్, ఫఖర్ జమాన్, సైమ్ అయూబ్, సల్మాన్ అఘా (కెప్టెన్), హుస్సేన్ తలత్, మహ్మద్ హారీస్ (వికెట్ కీపర్), మహ్మద్ నవాజ్, ఫహీమ్ అష్రఫ్, షాహీన్ అఫ్రిది, హారీస్ రవూఫ్, అబ్రార్ అహ్మద్