
ఆసియా కప్ లో భాగంగా సూపర్-4 రౌండ్ లో తొలి మ్యాచ్ ప్రారంభమైంది. శనివారం (సెప్టెంబర్ 20) బంగ్లాదేశ్, శ్రీలంక తొలి మ్యాచ్ ఆడేందుకు సిద్ధమయ్యాయి. దుబాయ్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో జరుగుతున్న ఈ మ్యాచ్ లో బంగ్లాదేశ్ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది. ఈ మ్యాచ్ లో బంగ్లాదేశ్ రెండు మార్పులతో బరిలోకి దిగుతోంది. మరోవైపు శ్రీలంక ఎలాంటి మార్పులు లేకుండా ఆడబోతుంది.
రెండు జట్ల బలాబలాలు పరిశీలిస్తే శ్రీలంక ఫేవరేట్ గా బరిలోకి దిగబోతుంది. ఈ టోర్నీ లీగ్ లో ఆడిన మూడు మ్యాచ్ ల్లో శ్రీలంక ఘన విజయం సాధించింది. మరోవైపు బంగ్లాదేశ్ ఒక మ్యాచ్ లో ఓడిపోయి రెండు మ్యాచ్ ల్లో విజయం సాధించింది. ఇరు జట్ల మధ్య జరిగిన మ్యాచ్ లో శ్రీలంకనే విజయం సాధించింది. లీగ్ మ్యాచ్ లో ఎదురైన ఓటమికి ప్రతీకారం తీర్చుకోవాలని బంగ్లా భావిస్తుంటే.. సూపర్ ఫామ్ ను కొనసాగిస్తూ మరో విజయాన్ని తమ ఖాతాలో వేసుకోవాలని లంక భావిస్తోంది.
బంగ్లాదేశ్ (ప్లేయింగ్ XI):
సైఫ్ హసన్, తాంజిద్ హసన్ తమీమ్, లిట్టన్ దాస్ (కెప్టెన్, వికెట్ కీపర్), తౌహిద్ హృదయ్, షమీమ్ హొస్సేన్, జాకర్ అలీ, మహేదీ హసన్, నసుమ్ అహ్మద్, తస్కిన్ అహ్మద్, షోరీఫుల్ ఇస్లాం, ముస్తాఫిజుర్ రెహమాన్
శ్రీలంక (ప్లేయింగ్ XI):
పాతుమ్ నిస్సాంక, కుసల్ మెండిస్ (వికెట్ కీపర్), కమిల్ మిషార, కుసల్ పెరీరా, చరిత్ అసలంక (కెప్టెన్), దసున్ షనక, కమిందు మెండిస్, వనిందు హసరంగా, దునిత్ వెల్లలాగే, దుష్మంత చమీర, నువాన్ తుషార