హరేకృష్ణ టెంపుల్లో నవంబర్ 14 నుంచి వార్షిక బ్రహ్మోత్సవాలు

హరేకృష్ణ టెంపుల్లో నవంబర్ 14  నుంచి వార్షిక బ్రహ్మోత్సవాలు

హైదరాబాద్​సిటీ, వెలుగు: బంజారాహిల్స్​హరే కృష్ణ గోల్డెన్ టెంపుల్​లో శుక్రవారం నుంచి 19 వరకు వార్షిక బ్రహ్మోత్సవాలను ఘనంగా నిర్వహించనున్నామని హరేకృష్ణ మూవ్ మెంట్ హైదరాబాద్ అధ్యక్షుడు సత్యగౌర చంద్రదాస ప్రభూజీ తెలిపారు. 14న లక్ష్మీనరసింహ స్వామి మూలవరులకు, ఉత్సవమూర్తుల అభిషేకంతో బ్రహ్మోత్సవాలు ప్రారంభమవుతాయన్నారు.

 సాయంత్రం భూ వరాహ పూజ, వైనతేయ ప్రతిష్ఠ, అంకురార్పణ,15న ఉదయం ఎనిమిదిన్నరకు ధ్వజారోహణం, సాయంత్రం లక్ష్మీ నరసింహ స్వామి వారికి ఊంజల సేవ, 16న ఉదయం మహా సుదర్శన హోమం, సాయంత్రం హనుమద్ వాహన సేవ, రాధా గోవింద ఝూలన్ ఉత్సవం, 17 న ఉదయం రాధా గోవింద మూలవర ప్రతిష్ఠ , భూసమేత నరసింహ స్వామి కల్యాణోత్సవం, 18న సాయంత్రం గరుడ వాహన సేవ, శ్రీ రాధా గోవింద ఝూలన్ ఉత్సవం, 19న మహా పూర్ణాహుతి, ఉత్సవార అభిషేకం, చక్ర స్నానం, సాయంత్రం పుష్ప యాగం, మహా చూర్ణాభిషేకం, మహా సంప్రోక్షణం ఉంటాయన్నారు. రోజూ దేవతామూర్తులకు నిత్యాలంకరణ ఉంటుందని, ఆ సందర్భంగా హరినామ సంకీర్తనలు ఆలపిస్తారన్నారు.