న్యూఢిల్లీ: ఇండియా, ఆప్ఘానిస్తాన్, శ్రీలంక ఏ జట్ల మధ్య జరగనున్న ముక్కోణపు సిరీస్‌కు భారత ఏ జట్టును బీసీసీఐ ప్రకటించింది. గురువారం (మే 14) 15 మంది పేర్లతో కూడిన జట్టును అనౌన్స్ చేసిన బీసీసీఐ హైదరాబాదీ యంగ్ క్రికెటర్ తిలక్ వర్మను కెప్టెన్‌గా నియమించింది. రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్ రియాన్ పరాగ్‌ను వైస్ కెప్టెన్‌గా ఎంపిక చేసింది. ఐపీఎల్లో పరుగుల వరద పారిస్తోన్న 15 ఏళ్ల యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ ఈ జట్టులో చోటు దక్కించుకున్నాడు.
వైభవ్ సూర్యవంశీతో పాటు ఐపీఎల్ 2026లో మెరుపులు మెరిపిస్తోన్న పంజాబ్ యువ ఓపెనర్స్ ప్రియాంష్ ఆర్య, ప్రభుసిమ్రాన్ సింగ్ కూడా జట్టుకు ఎంపికయ్యారు. 2026, మే 31న ఐపీఎల్ ముగిసిన వెంటనే వీరంతా ఈ సిరీస్ కోసం శ్రీలంక వెళ్లనున్నారు. కాగా, 2026, జూన్ 9 నుంచి శ్రీలంక వేదికగా ఇండియా, ఆప్ఘానిస్తాన్, శ్రీలంక ఏ జట్లు ముక్కోణపు వన్డే సిరీస్‌లో తలపడనున్నాయి.
►ALSO READ | ఇక జాతీయ వేట మొదలు..! శ్రీలంక, ఆఫ్ఘనిస్థాన్ ట్రై-సిరీస్‌కు భారత ఏ జట్టుకు ఎంపికైన వైభవ్
అండర్ 19 వరల్డ్ కప్, ఐపీఎల్ 2026లో దుమ్మురేపుతోన్న వైభవ్.. ఈ సిరీస్‌లో ఎలా రాణిస్తాడోనని అందరి కళ్లు అతడిపైనే ఉన్నాయి. ఇండియా ఏ జట్టులో చోటు దక్కించుకున్న 15 ఏళ్ల చిచ్చర పిడుగు ఈ సిరీస్‌లో రాణిస్తే జాతీయ జట్టులో అరంగ్రేటానికి లైన్ క్లియర్ అవుతోంది.
ముక్కోణపు సిరీస్‌కి భారత్-ఏ జట్టు ఇదే
తిలక్ వర్మ (కెప్టెన్), ప్రియాంష్ ఆర్య, వైభవ్ సూర్యవంశీ, రియాన్ పరాగ్ (వైస్ కెప్టెన్), ఆయుష్ బదోని, నిశాంత్ సింధు, హర్ష్ దుబే, సూర్యాంష్ షెడ్జ్, ప్రభ్‌సిమ్రాన్ సింగ్ (డబ్ల్యూకే), కుమార్ కుషాగ్రా (డబ్ల్యూకే), విప్రజ్ నిగమ్, యుద్ వీర్ సింగ్, అన్షుల్ కాంబోజ్, అర్షద్ ఖాన్.
