లైవ్‌లో కన్నీళ్లు పెట్టుకున్న దర్శకుడు.. సూర్య ‘వీరభద్రుడు’ రిలీజ్ ఆగిపోవడానికి అసలు కారణం ఇదే!

లైవ్‌లో కన్నీళ్లు పెట్టుకున్న దర్శకుడు.. సూర్య ‘వీరభద్రుడు’ రిలీజ్ ఆగిపోవడానికి అసలు కారణం ఇదే!

కోలీవుడ్ స్టార్ హీరో సూర్య, త్రిష నటించిన మోస్ట్ అవేటెడ్ మూవీ ‘కరుప్పు’ (తెలుగులో ‘వీరభద్రుడు’) నేడు (మే 14) థియేటర్లలో సందడి చేయాల్సి ఉంది. కానీ, అనూహ్యంగా మార్నింగ్ షోలు రద్దవ్వడమే కాదు ఏకంగా సినిమా వాయిదా పడటంతో అభిమానులు తీవ్ర నిరాశకు గురయ్యారు. కేవలం ఇండియాలోనే కాదు, ఓవర్సీస్ (అమెరికా) కూడా క్యాన్సిల్ కావడంతో సోషల్ మీడియాలో ఈ ఇష్యూ హాట్ టాపిక్ అయ్యింది.

సీఎం గ్రీన్ సిగ్నల్ ఇచ్చినా.. 

తమిళనాడు రాజకీయాల్లో పెను మార్పులు తెచ్చిన ముఖ్యమంత్రి విజయ్, సినిమా ఇండస్ట్రీ కోసం ఒక ప్రత్యేక వెసులుబాటు కల్పించారు. గతంలో అక్కడ ఉదయం ఆటలకు అనుమతి ఉండేది కాదు. కానీ విజయ్ సీఎంగా బాధ్యతలు చేపట్టాక, ఉదయం 9 గంటల షోలకు అనుమతిస్తూ జీవో జారీ చేశారు. ‘కరుప్పు’ చిత్రానికి కూడా ప్రత్యేక అనుమతులు వచ్చాయి. అయితే, ప్రభుత్వం నుంచి అనుమతి ఉన్నా.. ఆర్థిక చిక్కులు (Financial Issues) సినిమాను అడ్డుకున్నాయి. ఏకంగా సినిమా వాయిదాకు దారితీసింది.

అసలు చిక్కు ఎక్కడ?

సినిమా ఇండస్ట్రీలో ఫైనాన్స్ క్లియరెన్స్ అనేది అత్యంత కీలకం. డ్రీమ్ వారియర్ పిక్చర్స్ నిర్మించిన ఈ చిత్రానికి సంబంధించి దాదాపు రూ. 10 కోట్లకు పైగా బకాయిలు ఉన్నట్లు సమాచారం. పాత సినిమాల తాలూకు బకాయిలు కూడా తోడవడంతో ఫైనాన్షియర్లు క్లియరెన్స్ ఇవ్వలేదు. బుధవారం రాత్రి నుంచి గురువారం ఉదయం వరకు జరిగిన చర్చలు విఫలం కావడంతో క్యూబ్ లాక్ కాలేదు, షోలు ఆగిపోయాయి.

కన్నీళ్లు పెట్టుకున్న దర్శకుడు.. 

ఈ పరిణామాలపై దర్శకుడు ఆర్జే బాలాజీ ఎక్స్ వేదికగా లైవ్‌లోకి వచ్చి కన్నీళ్లు పెట్టుకున్నారు. సూర్య గారి ఫ్యాన్స్‌కు క్షమాపణలు చెబుతున్నాను. ఉదయం 9 గంటల షో కోసం మీరు ఎంతో దూరం నుంచి వచ్చి ఇబ్బంది పడ్డారు. ఇలా జరుగుతుందని అస్సలు ఊహించలేదు. సూర్య గారు కూడా సమస్య పరిష్కారానికి ఎంతో సహకరిస్తున్నారు అంటూ ఎమోషనల్ అయ్యారు. అటు హీరో ధనుష్ స్పందిస్తూ.. అడ్డంకులన్నీ తొలగిపోయి సినిమా త్వరగా రిలీజ్ కావాలని ఆకాంక్షించారు.

►ALSO READ | OTT Release This Week: ఈ శుక్రవారం ఏకంగా 16 సినిమాలు స్ట్రీమింగ్.. ఓటీటీలో ఇవి అసలు మిస్ కావద్దు!

ప్రస్తుతం చర్చలు కొనసాగుతున్నాయి.  సమస్య సర్దుమణిగితే షోలు మొదలయ్యే అవకాశం ఉంది. లేదంటే సినిమా విడుదల మరో తేదీకి వాయిదా తప్పదు. సూర్య ఫ్యాన్స్ మాత్రం తమ అభిమాన హీరో ‘వీరభద్రుడు’ అవతారంలో ఎప్పుడు థియేటర్లలోకి వస్తాడా అని ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు.

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by RJ Balaji (@irjbalaji)