బంజారాహిల్స్ హరేకృష్ణ గోల్డెన్ టెంపుల్ లో ఘనంగా కార్తీక దీపోత్సవం.. గోవర్ధన గిరిధారికి 56 ఫలహారాలు

బంజారాహిల్స్ హరేకృష్ణ గోల్డెన్  టెంపుల్ లో ఘనంగా కార్తీక దీపోత్సవం..  గోవర్ధన గిరిధారికి 56 ఫలహారాలు

బంజారాహిల్స్ రోడ్​నంబర్ 12లోని హరేకృష్ణ గోల్డెన్ టెంపుల్​లో బుధవారం గోవర్ధన పూజ, కార్తీక దీపోత్సవం ఘనంగా జరిగాయి. ఆలయంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన గోవర్ధన పర్వత ప్రతిరూపం భక్తులను ఆకట్టుకుంది. స్వామివారికి 56 రకాల ఫలహారాలతో అన్నకూట్​ సమర్పించారు. గోపూజ, భక్తి కీర్తనలు, పల్లకీ ఉత్సవం, నెయ్యి దీపారాధతో ఆలయంలో ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది. హరేకృష్ణ మూమెంట్ హైదరాబాద్ అధ్యక్షులు సత్యగౌర చంద్రదాస ప్రభూజీ గోవర్ధన లీలల గురించి ప్రసంగించారు.