బంజారాలకు మంత్రి పదవి ఇవ్వాలి: తెలంగాణ గిరిజన మేధావుల ఫోరం డిమాండ్

బంజారాలకు మంత్రి పదవి ఇవ్వాలి: తెలంగాణ గిరిజన మేధావుల ఫోరం డిమాండ్

 

బషీర్​బాగ్, వెలుగు: బంజారాలకు డిప్యూటీ స్పీకర్ ఇచ్చిన రాష్ట్ర ప్రభుత్వం మంత్రి పదవి కూడా ఇవ్వాలని తెలంగాణ గిరిజన మేధావుల ఫోరం విజ్ఞప్తి చేసింది. బంజారా గిరిజనులు ఎదుర్కొంటున్న సమస్యలపై హైదరాబాద్ లక్డీకాపుల్ లోని ఓ హోటల్ లో ఫోరం అధ్యక్షుడు డాక్టర్ ధనుంజయ్ నాయక్, ప్రధాన కార్యదర్శి డాక్టర్ హరిచరణ్ ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించారు. అధ్యక్షుడు మాట్లాడుతూ ప్రత్యేక ఎస్టీ కమిషన్, తండా డెవలప్ మెంట్ బోర్డు ఏర్పాటు చేయాలన్నారు.

కాంగ్రెస్‎ను అధికారంలో తీసుకొచ్చింది బంజారాలేనని సేవాలాల్ జయంతి రోజు స్వయంగా సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారని గుర్తు చేశారు. అన్ని పార్టీల బంజారా ప్రజాప్రతినిధులతో త్వరలోనే సమావేశం ఏర్పాటు చేస్తామన్నారు.  సీఎంను కూడా కలుస్తామన్నారు. మాజీ ఎంపీ రవీంద్ర నాయక్, రిటైర్డ్ జేటీసీ పాండురంగ నాయక్ పాల్గొన్నారు.