వారానికి రెండు సెలవులు ఇవ్వాలి.. కోఠిలో బ్యాంకు ఉద్యోగుల ధర్నా

వారానికి రెండు సెలవులు ఇవ్వాలి..  కోఠిలో బ్యాంకు ఉద్యోగుల ధర్నా

బషీర్​బాగ్, వెలుగు: వారానికి ఐదు రోజుల పని దినాలను అమలు చేయాలని డిమాండ్ చేస్తూ యునైటెడ్ ఫోరమ్ ఆఫ్ బ్యాంక్ యూనియన్స్ ఆధ్వర్యంలో ప్రభుత్వ రంగ బ్యాంక్ ఉద్యోగులు మంగళవారం కోఠిలోని ఎస్బీఐ ప్రధాన కార్యాలయం వద్ద భారీ ధర్నా నిర్వహించారు.

 గత 15 ఏండ్లుగా తాము వారానికి రెండు రోజుల సెలవు కోసం పోరాడుతున్నామని, తీవ్ర పని ఒత్తిడి వల్ల కుటుంబాలతో సమయం గడపలేకపోతున్నామని ఈ సందర్భంగా యూనియన్ నాయకులు ఆవేదన వ్యక్తం చేశారు. రిజర్వ్ బ్యాంకు తరహాలోనే తమకు కూడా ఐదు రోజుల పని దినాలు కల్పిస్తే మరింత ఉత్సాహంతో విధులు నిర్వహిస్తామని పేర్కొన్నారు. ఈ నిరసనలో పాల్గొన్న ప్రొఫెసర్ నాగేశ్వర్ ఉద్యోగుల డిమాండ్ న్యాయబద్ధమైనదని, కేంద్ర ప్రభుత్వం దీనిపై సానుకూల నిర్ణయం తీసుకోవాలని కోరారు.