Bank Holidays : డిసెంబర్లో బ్యాంకులకు 18 రోజులు సెలవులు

Bank Holidays :   డిసెంబర్లో బ్యాంకులకు 18 రోజులు సెలవులు

బ్యాంక్ కస్టమర్లకు అలర్ట్... 2023 డిసెంబర్లో బ్యాంకులకు ఏకంగా 18 రోజులు సెలవులు రానున్నాయి.  ఐదు ఆదివారాలు,  రెండో,నాలుగో శనివారాలతో కలిపి ఈ నెలలో18 రోజులు బ్యాంకులు బంద్ కానున్నాయి. ఇందులో  ఆర్బీఐ హాలిడే లిస్టుతో పాటు ప్రాంతీయ సెలవులు, సమ్మె దినాలు ఉన్నాయి.  

తెలుగు రాష్ట్రాల విషయానికి వస్తే డిసెంబర్ నెలలో బ్యాంకులకు 8 రోజులు సెలవులు ఉన్నాయి. నేరుగా బ్యాంకులకు వెళ్లి పనులు చేసుకునేవాళ్లు ఏ ఏ తేదీల్లో బ్యాంకులు మూతబడతాయో తెలుసుకోవడం ముఖ్యం. బ్యాంకులకు సెలవులు ఉన్నప్పటికీ.. ఇంటర్నెట్ బ్యాంకింగ్​, మొబైల్ బ్యాంకింగ్, యూపీఐ సర్వీసులు, ఏటీఎం సేవలు సేవలు మాత్రం అందుబాటులో ఉంటాయి. 

డిసెంబర్‌లో బ్యాంక్ సెలవులు 

  • 1 డిసెంబర్ : రాష్ట్ర వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా ఇటానగర్, కోహిమా బ్యాంకులకు సెలవు
  • 3 డిసెంబర్ :- ఆదివారం సెలవు
  • 4 డిసెంబర్ :- సెయింట్ ఫ్రాన్సిస్ జేవియర్ పండుగ కారణంగా గోవాలోని పనాజీలో సెలవు
  • 9 డిసెంబర్ : రెండో శనివారం సెలవు
  • 10 డిసెంబర్ : ఆదివారం సెలవు
  • 12 డిసెంబర్ : లాసంగ్/పా టోగాన్ నెంగ్‌మింజా సంగ్మా షిల్లాంగ్‌లో సెలవు
  • డిసెంబర్ 13, 14 : లోసంగ్/ పా తోగన్ కారణంగా గాంగ్‌టక్‌లోని బ్యాంకులకు సెలవు
  • డిసెంబర్ 17 : ఆదివారం సెలవు
  • డిసెంబర్ 18, 2023- యు సో సో థామ్ వర్ధంతి కారణంగా షిల్లాంగ్‌లోని బ్యాంకులకు సెలవు
  • డిసెంబర్ 19 : గోవా విమోచన దినోత్సవంతో పనాజీలో సెలవు
  • డిసెంబర్ 23 : నాలుగో శనివారం
  • డిసెంబర్ 24 : ఆదివారం సెలవు
  • డిసెంబర్ 25 : క్రిస్మస్ కారణంగా దేశవ్యాప్తంగా బ్యాంకులు మూసివేత
  • డిసెంబర్ 26 : ఐజ్వాల్, కొహిమా, షిల్లాంగ్‌లలో క్రిస్మస్ సెలవు
  • డిసెంబర్ 27 : క్రిస్మస్ కారణంగా కోహిమాలోని బ్యాంకులు మూసివేత
  • డిసెంబర్ 30 : యు కియాంగ్ కారణంగా షిల్లాంగ్‌లోని బ్యాంకులకు సెలవు
  • డిసెంబర్ 31 : ఆదివారం సెలవు ఉంటుంది