సెప్టెంబర్లో బ్యాంకుల హాలీడేస్ లిస్ట్ ఇదిగో: మొత్తం 15 రోజులు బంద్..

 సెప్టెంబర్లో బ్యాంకుల హాలీడేస్ లిస్ట్ ఇదిగో:  మొత్తం 15 రోజులు బంద్..

ఈ నెలలో ఏదైనా బ్యాంక్ పని మీద మీరు బ్యాంకుకు వెళ్లాల్సి ఉంటే ముందే ప్లాన్ చేసుకోండి. ఎందుకంటే ఎప్పటిలాగే  ప్రతినెల బ్యాంకులకు సాధారణ సెలవుతో పాటు ప్రాంతీయ అలాగే రాష్ట్ర పండుగల  రోజున సెలవు ఉంటుంది. ఈ రోజుల్లో కొన్ని బ్యాంక్ సేవలు మీకు అందుబాటులో ఉండవు.    

అయితే, కస్టమర్లు బ్యాంకుకి వెళ్లి చేయాల్సిన కొన్ని పనులు కూడా ఉంటాయి. అందుకే మనం బ్యాంకుకు వెళ్లే రోజున ముందే బ్యాంకు తెరిచి ఉంటుందా  లేదా మూసివేసి ఉంటుందా అని తెలుసుకోవడం అవసరం. ఇవాళ సెప్టెంబర్ నెల ప్రారంభమైంది. సెప్టెంబర్ నెలలో బ్యాంకులు ఎన్ని రోజులు తెరిచి ఉంటాయి, ఎన్ని రోజులు మూసి ఉంటాయి అనేది ముఖ్యం. మీ నగరంలో లేదా ఎరియాలో బ్యాంకుల సెలవుల లిస్ట్  మీరు ముందుగానే తెలుసుకోవచ్చు...

సెప్టెంబర్లో బ్యాంకుల హాలిడేస్ లిస్ట్ :
సెప్టెంబర్ 3 (బుధవారం): కర్మ పూజ సందర్భంగా జార్ఖండ్‌లో బ్యాంకులకు సెలవు ఉంటుంది.
సెప్టెంబర్ 4  (గురువారం): కేరళలో ఓనం పండుగ సందర్భంగా బ్యాంకులు మూసి ఉంటాయి.
సెప్టెంబర్ 5 (శుక్రవారం):  ఈద్-ఈ-మిలాద్ సందర్భంగా గుజరాత్, మిజోరం, మహారాష్ట్ర, కర్ణాటక, మధ్యప్రదేశ్, తమిళనాడు, ఉత్తరాఖండ్, తెలంగాణ, విజయవాడ, మణిపూర్, జమ్మూ, ఉత్తరప్రదేశ్, కేరళ, న్యూఢిల్లీ, జార్ఖండ్, జమ్మూ మరియు శ్రీనగర్‌లలో బ్యాంకులకు సెలవు ఉంటుంది.
సెప్టెంబర్ 6 (శనివారం): ఈద్-ఈ-మిలాద్ (మిలాద్-ఉన్-నబి)/ఇంద్రజత్ర సందర్భంగా  సిక్కిం, ఛత్తీస్‌గఢ్‌లో బ్యాంకులకు సెలవు.
సెప్టెంబర్ 12 (శుక్రవారం): ఈద్-ఈ-మిలాద్-ఉల్-నబి తరువాత రోజైన శుక్రవారం నాడు జమ్ము, శ్రీనగర్‌లో బ్యాంకులు మూసి ఉంటాయి.
సెప్టెంబర్ 22  (సోమవారం): నవరాత్రి స్థాపన/ మొదటి రోజు సందర్భంగా రాజస్థాన్‌లో బ్యాంకులకు సెలవు ఉంటుంది.
సెప్టెంబర్ 23 (శనివారం): మహారాజా హరి సింగ్ జీ జన్మదినం సందర్భంగా జమ్ము, శ్రీనగర్‌లో బ్యాంకులు మూసిఉంటాయి.
సెప్టెంబర్ 29 (సోమవారం): మహా సప్తమి, దుర్గా పూజ సందర్భంగా త్రిపుర, అస్సాం, పశ్చిమ బెంగాల్‌లో బ్యాంకులకి  హాలీడే ఉంటుంది.
సెప్టెంబర్ 30 (మంగళవారం): మహా అష్టమి/దుర్గా అష్టమి/దుర్గా పూజ సందర్భంగా త్రిపుర, ఒడిశా, అస్సాం, మణిపూర్, రాజస్థాన్, పశ్చిమ బెంగాల్, బీహార్, జార్ఖండ్‌లలో బ్యాంకులకు సెలవు ప్రకటించారు.

దీనితో పాటు దేశవ్యాప్తంగా బ్యాంకులకు ప్రతి ఆదివారం,రెండో శనివారం అలాగే నాలుగో శనివారం సాధారణ సెలవు ఉంటుంది. సెప్టెంబర్ 7(ఆదివారం), సెప్టెంబర్ 13(రెండో శనివారం), సెప్టెంబర్ 14 (ఆదివారం),సెప్టెంబర్ 21(ఆదివారం),సెప్టెంబర్ 27,(నాలుగో శనివారం), సెప్టెంబర్ 28(ఆదివారం).

ఆన్‌లైన్ బ్యాంకింగ్ సేవలు: బ్యాంక్ సెలవు రోజుల్లో కూడా ఆన్‌లైన్ బ్యాంకింగ్ సేవలు దేశవ్యాప్తంగా ఎప్పటిలాగే కొనసాగుతాయని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తెలిపింది. కాబట్టి ఆర్థిక లావాదేవీల కోసం ఈ సేవలనుఉపయోగించుకోవచ్చని వెల్లడించింది. ఆన్‌లైన్ సేవలకు ఎలాంటి అంతరాయం ఉండదని పేర్కొంది.