Jobs : డిగ్రీ పాస్ అయ్యి ఉంటే చాలు.. : బ్యాంక్ ఆఫ్ బరోడాలో 5 వేల ఉద్యోగాలకు నోటిఫికేషన్..

Jobs : డిగ్రీ పాస్ అయ్యి ఉంటే చాలు.. : బ్యాంక్ ఆఫ్ బరోడాలో 5 వేల ఉద్యోగాలకు నోటిఫికేషన్..

బ్యాంక్ ఆఫ్​ బరోడా దేశవ్యాప్తంగా అప్రెంటీస్ ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆసక్తి, అర్హత గల అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. ఆన్‌‌‌‌‌‌‌‌లైన్ దరఖాస్తు ప్రక్రియ మే 19న ప్రారంభమై జూన్ 8న ముగుస్తుంది. 

పోస్టులు: అప్రెంటీస్ షిప్.

మొత్తం ఖాళీలు: 5000. తెలంగాణ రాష్ట్రంలో 83 ఖాళీలు ఉన్నాయి. 

ఎలిజిబిలిటీ: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి ఏదైనా డిగ్రీ పూర్తిచేసి ఉండాలి. 2026, మే 1 నాటికి డిగ్రీ పూర్తయి నాలుగేండ్ల దాటకూడదు. అభ్యర్థి ఇంతకుముందు బ్యాంక్ ఆఫ్​ బరోడాలో గానీ లేదా ఏదైనా ఇతర సంస్థలో గానీ అప్రెంటీస్‌‌‌‌‌‌‌‌షిప్ చేసి ఉండకూడదు. 
డిగ్రీ పూర్తిచేసిన తర్వాత ఏడాది లేదా అంతకంటే ఎక్కువ కాలం శిక్షణ లేదా ఉద్యోగానుభవం ఉన్న అభ్యర్థులు అర్హులు కాదు. 

వయోపరిమితి: 20 నుంచి 28 ఏళ్ల మధ్యలో ఉండాలి. ఎస్సీ, ఎస్టీలకు ఐదేళ్లు, ఓబీసీలకు మూడేళ్లు, పీడబ్ల్యూబీడీలకు పదేళ్లు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది. 

అప్లికేషన్: ఆన్​లైన్ ద్వారా.

అప్లికేషన్ ప్రారంభం: మే 19.

అప్లికేషన్ ఫీజు: ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూబీడీలకు రూ. 200. జనరల్, ఈడబ్ల్యూఎస్,  ఓబీసీ పురుష అభ్యర్థులకు రూ. 800. జనరల్, ఈడబ్ల్యూఎస్,  ఓబీసీ మహిళా అభ్యర్థులకు రూ. 600. 

లాస్ట్ డేట్: జూన్ 8.

ఆన్​లైన్ రాత పరీక్ష: 2026, జులై. 

సెలెక్షన్ ప్రాసెస్: ఆన్ లైన్ రాత పరీక్ష, డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. 

మరిన్ని వివరాలకు వెబ్​సైట్ bankofbaroda.bank.inను సందర్శించండి.