
హైదరాబాద్, వెలుగు: బ్యాంక్ ఆఫ్ ఇండియా (బీఓఐ) కి ఈ ఏడాది మార్చితో ముగిసిన క్వార్టర్‌లో రూ.2,626 కోట్ల నికర లాభం వచ్చింది. కిందటేడాది మార్చి క్వార్టర్‌తో పోలిస్తే 82 శాతం పెరిగింది. మొత్తం 2024–25 ఫైనాన్షియల్ ఇయర్‌ను పరిగ ణలోకి తీసుకుంటే బ్యాంక్ నికర లాభం ఏడాది లెక్కన 46 శాతం వృద్ధి చెంది రూ.9,219 కోట్లకు చేరుకుంది.
బీఓఐ గ్రాస్ ఎన్‌పీఏల రేషియో క్యూ4లో ఏడాది లెక్కన 1.71 శాతం తగ్గి 3.27 శాతానికి చేరింది. నెట్ ఎన్‌పీఏల రేషియో 0.40 శాతం మెరుపడి 0.82 శాతానికి దిగొచ్చింది. బ్యాంక్ క్యాపిటల్ అడెక్వసీ రేషియో 17.77 శాతంగా ఉంది. మొబైల్ బ్యాంకింగ్ యాప్ ‘బీఓఐ మొబైల్ ఓమ్నీ నియో బ్యాంక్’ ద్వారా 440 కి పైగా సర్వీస్‌లను బీఓఐ అందిస్తోంది.