బ్యాంక్ ఆఫ్​ మహారాష్ట్ర బ్రాంచ్​లు ప్రారంభం

బ్యాంక్ ఆఫ్​ మహారాష్ట్ర బ్రాంచ్​లు ప్రారంభం

హైదరాబాద్​, వెలుగు :  సిటీలోని పంజాగుట్టలో బ్యాంక్​ఆఫ్​మహారాష్ట్ర (బీవోఎం) రెండు బ్రాంచ్​లను ప్రారంభించింది. శనివారం బ్యాంక్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఆశిష్ పాండే సమక్షంలో ఆర్థిక శాఖ ప్రత్యేక కార్యదర్శి కె. కృష్ణారావు మిడ్ కార్పొరేట్ బ్రాంచ్‌‌తో పాటు పంజాగుట్ట శాఖ బ్రాంచ్​ను ఓపెన్ చేశారు. ఈ సందర్భంగా కృష్ణారావు మాట్లాడుతూ.. ఇవి స్థానిక ప్రజల బ్యాంకింగ్, ఆర్థిక అవసరాలను తీర్చుతాయని పేర్కొన్నారు.  

రిటైల్​, ఎమ్ఎస్ఎమ్ఈలపై దృష్టి పెట్టాలని బ్యాంక్​బ్రాంచ్​ల నిర్వాహకులకు సూచించారు. హైదరాబాద్​లో బ్రాంచ్​లను ప్రారంభించినందుకు ప్రశంసించారు.​  బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఆశిష్ పాండే మాట్లాడుతూ... రిటైల్​కస్టమర్లకు, చిన్న వ్యాపారులకు సేవలు అందించడంతో బ్రాంచ్​లు ఎంతగానో ఉపయోగపడుతాయని తెలిపారు.  దేశంలో 2,200 కంటే ఎక్కువ బ్రాంచ్​లతో 30 మిలియన్ల కస్టమర్లకు  బీవోఎం సేవలందిస్తుందని పేర్కొన్నారు. కార్యక్రమంలో జనరల్​మేనేజర్లు ఏఎఫ్​కబాడే, చిత్ర దాతర్, జోనల్​మేనేజర్​సుశాంత్ కుమార్ గుప్తా, మిడ్ కార్పొరేట్ బ్రాంచ్ మేనేజర్ పి.మనోహర్, పంజాగుట్ట బ్రాంచ్ మేనేజర్ జి.రమేశ్, హైదరాబాద్ జోన్ టీమ్ పంజాగుట్ట, టీమ్ పాల్గొన్నారు.